Connect with us

Movie News

అజ్ఞాతవాసి చెత్త మూవీ అంటూ కామెంట్ చేసిన కత్తి మహేష్

Published

on

అజ్ఞాతవాసి ”చెత్త సినిమా” అనేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. పవన్ కల్యాణ్ అంటేనే, ఆయన ఫ్యాన్స్ అంటేనే అంతంతకుపైకి లేచే కత్తి.. జనవరి 10న (నేడు) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి సినిమాను థియేటర్లో చూశారు. ఇక సినిమా గురించి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఓ చెత్త సినిమా అంటూ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

రివ్యూల పరంగా అజ్ఞాతవాసికి పాజిటివ్ టాకొచ్చిన నేపథ్యంలో.. సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ కత్తి మహేష్ మాత్రం ఈ సినిమాపై విశ్లేషణ ఇచ్చాడు. సీరియస్‌గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని కత్తి మహేష్ చెబుతున్నాడు.

సినిమాను అజ్ఞాతవాసి అపహాస్యం చేసిందని విమర్శలు గుప్పించారు. పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా చాలా దారుణంగా వుందని.. ‘రిస్క్ చేసి చూస్తే… టైమేమో… మీ ఇష్టం’ (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్‌లో ఉంది) అంటూ కామెంట్ చేశారు.

ఇదిలా ఉంటే.. అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ కాసేపు అలా మెరుస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఈ సినిమాలో వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో ఓ నాలుగు నిమిషాల పాటు కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. తీరా అజ్ఞాతవాసి విడుదలయ్యాక చూస్తే వెంకీ సీన్ లేదు. కానీ వెంకీ సీన్‌ను త్వరలో అజ్ఞాతవాసిలో జోడిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

Latest News

Trending

%d bloggers like this: