Connect with us

Movie News

కత్తి మహేష్ రివ్యూ: రంగస్థలం మూవీ ఎలా ఉందంటే..?

Published

on

వేసవి కానుకగా విడుదలైన రంగస్థలం మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ విడుదలైన తెలుగు మూవీస్ లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ.. ఈ మూవీకు ప్రధాన బలం. 1980ల నాటి గోదావరి పల్లెటూరు అందాలను మరోసారి తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందుంచారు. ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది.

‘రంగస్థలం’ మూవీ గురించి మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా స్పందించాడు. ఓల్డ్ బాటిల్‌లోని ఓల్డ్ వైన్‌‌తో మూవీని పోల్చాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు గుప్పించాడు. అనవసరంగా సాగదీసినప్పటికీ. మూవీలోని నటీనటులంతా అద్భుతంగా నటించడంతో.. భరించొచ్చంటూ చూడొచ్చంటూ ట్వీట్ చేశాడు.

సినిమా గురించి కత్తి మహేష్ రివ్యూ పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. ఎక్కడా హీరో రామ్ చరణ్ పేరుగానీ, డైరెక్టర్ సుకుమార్ పేరు గానీ ప్రస్తావించలేదు. ఇక్కడే మెగా అభిమానులకు కోపం వచ్చింది. మిగతా మూవీలో హీరో నటన బాగుంది.. కేక.. అబ్బో అంటూ పొగడ్తలు గుప్పిస్తావ్.. మరి మెగా హీరో పేరెత్తలేదెందుకు.. నువ్వు.. నీ రివ్యూలు అంటూ.. మెగా ఫాన్స్ తిడుతున్నారు.

Latest News

Trending

%d bloggers like this: