Connect with us

Movie News

కళ్యాణ్‌రామ్, కాజల్ ఎమ్మెల్యే మూవీ చందమామ ఎదురొస్తే సాంగ్‌

Published

on

టాలీవుడ్‌ చందమామ కాజల్‌తో ‘ఎమ్మెల్యే’(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) పబ్లిక్‌లోనే తెగ రొమాన్స్ చేసేస్తున్నాడు. ‘సన్నజాజి నిను చూస్తే.. డైటింగ్ చేస్తాదే!! చందమామ ఎదురొస్తే.. మేకప్పు వేస్తాదే’ అంటూ కాజల్‌ను లైన్‌లో పెట్టేందుకు కళ్యాణ్ రామ్ ఈ సాంగ్‌లో తెగ కష్టపడుతున్నాడు. కళ్యాణ్‌రామ్- కాజల్ జంటగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఎమ్మెల్యే’ మార్చి 23న విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేస్తూ ‘హేయ్ ఇందు’ అనే సాంగ్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు చిత్ర యూనిట్. మెలోడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతాన్ని అందించగా.. కసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. యువ సింగర్ రాహుల్ ఈ సాంగ్‌ను పాడారు.

ఎమ్మెల్యే మూవీ ఆడియో వేడుకను కర్నూల్‌లో ఈనెల 17న వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ వేడుకకు యంగ్ ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరౌతున్నట్లు సమాచారం.

Latest News

Trending

%d bloggers like this: