Connect with us

Movie News

శ్రీజ.. నువ్వే నా బలం: చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్

Published

on

శ్రీజ తన బలమని చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ అంటున్నారు. నేడు వారి రెండో వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో కళ్యాణ్, శ్రీజతో పాటు నివృతి (శ్రీజ మొదటి భర్త కూతురు) కూడా ఉంది. ‘నువ్వే నా బలం. హ్యాపీ యానివర్సరీ’ అని కళ్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు వీరి వివాహబంధానికి రెండేళ్లు పూర్తికావడంతో మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

శ్రీజ వివాహం కళ్యాణ్ దేవ్‌తో 2016 మార్చి 28న బెంగళూరులో జరిగింది. మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ చాలా దగ్గరగా ఉంటారు. చిరంజీవి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ లో కళ్యాణ్ పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తనకు మూవీలంటే ఆసక్తి ఉందని కళ్యాణ్.. చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన పచ్చజెండా ఊపడంతో కళ్యాణ్ హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు.

రాకేశ్ శశి డైరేక్షన్ లో కళ్యాణ్ సినిమా చేస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ఈ ప్రేమకథా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి నిర్మిస్తోంది. ఈ మూవీలో కళ్యాణ్‌కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటిస్తుంది. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు

Latest News

Trending

%d bloggers like this: