Connect with us

Technology

జియో, ఎయిర్‌టెల్ మధ్య పోటాపోటీ, సంతోషంలో యూజర్లు….!

Published

on

ఇటీవ‌ల రూ. 98 రీఛార్జీతో 14 రోజుల వ్యాలిడిటీ, 2.1 జీబీ డేటా ఆఫ‌ర్‌ను జియో ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే. దీనికి ప్ర‌తిగా ఓ రూ. 5 తగ్గించి ఎయిర్‌టెల్ నెట్వర్క్ రూ. 93 రీఛార్జీ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా ప‌ది రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటాను అంద‌జేస్తోంది. వ్యాలిడిటీ విష‌యంలో కొంచెం తేడా ఉన్నప్పటికీ, జియో మాదిరిగా రోజుకి 0.15 జీబీ మాత్ర‌మే వాడుకోవాల‌ని ఎయిర్‌టెల్ ప‌రిమితుల‌ను విధించ‌లేదు. అలాగే అప‌రిమిత లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను అంద‌జేస్తోంది. కొత్త సంవత్సరం సంద‌ర్భంగా జియోకు పోటీని ఇవ్వ‌డానికి ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌తో పాటు ఐడియా, వొడాఫోన్‌లు కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నారు . ఏదేమైనా కొత్త‌సంవ‌త్స‌రం పుణ్య‌మాని వినియోగ‌దారుడు లాభ‌ప‌డితే చాల‌ని మార్కెట్ నిపుణులు అనుకుంటున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: