Connect with us

Political News

బయటకు వచ్చిన నిజాలు….!జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు..!

Published

on

జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు పెట్టారు.

ఎంబ్లామింగ్‌లో భాగంగానే జయలలిత ఎడమ దవడపై రంధ్రాలు చేసినట్టు మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ) అనాటమీ విభాగం చీఫ్ డాక్టర్ సుధా శేషయ్యన్ విచారణ కమిటీకి తెలిపారు. జయలలిత మృతిపై ఏర్పాటైన జస్టిస్ అర్ముగస్వామి కమిటీ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పారు. జయకు అత్యంత సన్నిహితురాలైన ఆమెకు జయ మరణించిన రోజు రాత్రి పది గంటలకు ఆసుపత్రి నుంచి కాల్ వచ్చింది. ప్రజలు సందర్శించే వరకు మృతదేహం చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఉండటానికి ఎంబ్లామింగ్ చేయడానికి తనను రమ్మన్నారని ఆమె పేర్కొన్నారు. తన వైద్య బృందంతో ఆసుపత్రికి చేరుకుని మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించేందుకు జయ ఎడమ దవడపై నాలుగు రంధ్రాలు చేసినట్టు చెప్పారు.

మెథనాల్ సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని జయ శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించినట్టు తెలిపారు.తీవ్ర అస్వస్థతకు గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల చికిత్స తర్వాత డిసెంబరు 5, 2016న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి అర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటైంది.

Latest News

Trending

%d bloggers like this: