Connect with us

Health

మరణించిన వ్యక్తి శరీరం నుంచి అరుపులు, శబ్దాలు వస్తాయా?

Published

on

human body

మనిషి మరణించాక అతని శరీరంలో ఏం జరుగుతుంది? అయితే మరణించిన మనిషి శరీరంలోగుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. రక్త సరఫరా ఆగిపోయి అవయవాలు అన్నీ పనిచేయడం మానేస్తాయి. శరీరం అంత  రాయిలాగా దృఢంగా గట్టిగా మారిపోతాయి. అయితే మరణించిన మనిషి శరీరం నుండి అరుపులు వస్తాయట. గుర్రు గుర్రుమనే శబ్దాలు వినిపిస్తాయట.

* మనిషి మరణించాక గుండె ఆగిపోయి రక్త సరఫరా అవ్వదు.అవయవాలు పనిచేయవు. దింతో  శరీరమంతా నీలి రంగులోకి మారిపోతుంది. శరీరంలోని మోగ్లోబిన్ తగ్గడం వలన శరీరం అంతా పసుపు రంగులోకి మారుతుంది.

* మరణించిన మనిషి మృతదేహంలో ఓ రకమైన గ్యాస్ ఉత్పన్నం అవుతుంటుంది. దీని వల్ల కళ్లు, నాలుక బయటికి పొడుచుకు వస్తాయి. అంతేకాదు అవయవాలు కుళ్లడం మొదలవుతుంది అంట.

* ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే మరణించిన వారి శరీరం నుండి శబ్దాలు వస్తాయి. పోస్ట్‌మార్టం చేసే సమయంలో శరీరంలో ఉండే గ్యాస్ స్వరపేటికపై ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్లే వివిధ రకాల శబ్దాలు బయటికి వినిపిస్తాయి అంట.

* మనిషి మరణించిన వెంటనే అతని మృతదేహంలో బాక్టీరియాలు, సూక్ష్మ జీవులు శరీరంలోకి చేరతాయంట. అలాంటి దేహాల వద్దకు చీమలు, సాలె పురుగులు కూడా ఎక్కువగానే వస్తాయి.

* మరణించిన మనిషి శరీరానికి కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు రాసి అలాగే ఉంచితే అందులోకి బాక్టీరియాలు, సూక్ష్మ క్రిములు ప్రవేశించవు. అయితే అప్పటి కాలంలో మమ్మీలను ఈవిధంగానే ఉంచేవారు. అందుకే ఎన్ని వందల సంవత్సరాలైనా మమ్మీలు అలాగే ఉంటాయి అంట.

* మనిషి మరణించిన మృతదేహం లెదర్ అంత స్ట్రాంగ్‌గా మారుతుంది. దీనికి కారణం ఆ శరీరంపై సరైన దుస్తులు కప్పకపోవడమే. అలా కప్పి ఉంచితే శరీరం అంత స్ట్రాంగ్‌గా మారదు.

* మరణించిన వారి శరీరాల్లో ఉత్పన్నమయ్యే గ్యాస్ కారణంగా ఆ శరీరం నుండి చర్మం కూడా ఊడిపోతూ ఉంటుంది. శరీరం లోపల అన్నింటికీ అతుక్కుని ఉండే చర్మం మొత్తం ఊడిపోతూ వస్తుంది.

Latest News

Trending

%d bloggers like this: