Connect with us

Health

ధనవంతులు కాబోతున్నారన్న ఆనవాళ్లు మీకు కలలో ఇవి కనిపిస్తాయట! అవేంటో తెలుసా?

Published

on

kalalu nijamu

మనందరికీ కలలు వస్తుంటాయి.అది సహజం.కళలు మంచివి ఉంటాయి, చెడ్డవీ ఉంటాయి. కొన్ని కలలు వచ్చాయంటే వాటి వెనక కొన్ని ముఖ్యమైన కారణాలుంటాయి. ఆ కలల వెనక కొన్ని వింతకరమైన  రహస్యాలుంటాయి. వస్తువులు, బంధువులు,జంతువులు, మనుషులు .. ఇలా కలలో ఏమేమో కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువే కలలో కనిపించిందంటే దానికి గుర్తులు ఉంటాయట. కలలో కనిపించేవన్నీ భ్రమ అని కొందరు అనుకుంటారు. కానీ మనకు కలలు వస్తున్నాయంటే ఫ్యూచర్ కి లేదా తర్వాత రోజు జరగబోయే వాటికి ఆనవాళ్ళని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి .మరో ముఖ్యమైన  విషయం ఏంటంటే మీ కలలో ఇప్పుడు చెప్పబోయేవి కనిపించాయి అంటే మీకు తొందరలోనే డబ్బు వస్తుందని, ధనవంతులు అవుతారని అర్ధం.

సూర్యుడు: కలలో సూర్యుణ్ణి చూశారంటే త్వరలోనే మీకు కొంచెం ధనం రాబోతుందని అర్ధం. అంతేకాదు చాలా ఎక్కువ కాంతితో సూర్యుడు కనిపిస్తే త్వరలోనే మీ జీవితం ఎక్కువ డబ్బుతో నిండిపోతుంది.

చంద్రుడు: కలలో సూర్యుడి లాగే చంద్రుడు కనిపిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారని అర్ధం. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు చిహ్నం. దాని వలన మీలో ఉన్న కోపం కూడా తగ్గుతుంది.

జుట్టు రాలినట్టు: నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద విషయమేమి కాదు. కలలో మీ జుట్టు రాలుతున్నట్టు కల వచ్చిందంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతం.

రెడీ అవుతున్నట్టు: సాధారణంగానే మనమందరం రెడీ అవుతూ ఉంటాం. అయితే మనం రెడీ అవుతున్నట్టు కల వచ్చిన, మీ ముఖం అందంగా కనిపించినా మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని అర్ధం .

పర్స్: కలలో పర్స్ కనిపించిందంటే త్వరలోనే మీకు కావాల్సినంత డబ్బు మీ సొంతమవుతుందని అర్ధం.

ఆవు: మీకు ఆవు పాలు ఇస్తున్నట్టు కలలో కనిపిస్తే త్వరలోనే మీరు సంపన్నులవుతారని సంకేతం

Latest News

Trending

%d bloggers like this: