Connect with us

Movie Reviews

స్టేజ్ పైన అందరి ముందు హరితేజకు వార్నింగ్ ఇచ్చిన బన్నీ

Published

on

hariteja bunny

బిగ్‌బాస్‌ షో తో పాపులర్ అయిన నటి హరితేజ. అప్పటికే చాలా సీరియల్లు, సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్‌బాస్‌ ద్వారా వచ్చింది. అంతే కాకుండా చాలా అవకాశాలు వస్తున్నాయి. వరుస టీవీషో లతో యాంకర్‌గా, నటిగా రాణిస్తోంది హరితేజ.

హరితేజకు, బన్నీకి విచిత్రమైన సంభాషణ జరిగింది. అల్లు శిరీష్‌ హీరోగా నటించిన ఒక్క క్షణం సినిమా ఆడియో లాంచ్ కి  వచ్చిన హరితేజ బన్నీని పొగడ్తలతో ముంచెత్తింది. తనకు అల్లూ అర్జున్ అంటే చాలా ఇష్టం అని తన మనసులో మాట చెప్పింది. దీనికి బన్నీ కూడా హరితేజ మంచి నటి అని ఆమె నటన అంటే తనకు ఇష్టం అని చెప్పాడు.

అంతేకాకుండా హరితేజకు ఓ స్వీట్‌ వార్నింగ్ కూడా ఇచ్చాడు బన్నీ. మరో సినీ వేదికపై మరో హీరో ఇష్టం అని చెబితే నేను ఊరుకోను అని అన్నాడు. అలా చేస్తే మీకు కచ్చితంగా ఫోన్ చేసి అడుగుతా అని బన్నీ స్వీట్‌ వార్నింగ్‌ను ఇచ్చాడు. దీనికి హరితేజ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. నిజంగానే మీరంటే ఇష్టం, ఎక్కడైనా మీ పేరే చెబుతా అంటూ బన్నీకి సమాధానమిచ్చింది.

Movie Reviews

అ! మూవీ ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ: బాగుంది కానీ.!

Published

on

ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌లోని టాలెంట్‌ను చూసి అతని కథ కోసం హీరో నాని స్వయంగా నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ అనే బ్యానర్‌ను ఏర్పాటుచేసి మూవీ తీసేశాడు. ఇప్పటి వరకు విభిన్న కథలు ఎంచుకుంటూ మూవీస్ చేస్తున్న నాని. ఇప్పుడో వైవిధ్యమైన కథతో నిర్మాతగా మొదటి సినిమాను తీశాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అ!’. నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈమూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాని నిర్మాత అనగానే ఈ మూవీపై అందరికీ ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌లు మూవీకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. మూవీ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు వెయిట్ చేసేంతగా ఈ మూవీకి ప్రచారం కల్పించారు. మొత్తానికి ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా ‘అ!’ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. హైదరాబాద్‌లోనూ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా మూవీను ప్రదర్శించారు. అందరి నోట ఒకటే మాట. ‘మూవీ సూపర్ గా ఉంది. నాని నిజంగా ఇంటిలిజెంట్ అని అందరు అంటున్నారు.

 

ఇదొక సైన్స్ ఫిక్షన్. కానీ అన్ని భావోద్వేగాలు ఉన్నాయట. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ప్రస్తావించారట. చెట్ల వల్ల మనకు కలిగే ఉపయోగాలు తదితర అంశాలను మూవీలో ప్రధాన అంశాలుగా చూపించారట. ముఖ్యంగా బోన్సాయి చెట్టుకు వాయిస్ ఓవర్ చెప్పిన రవితేజ నవ్విస్తూనే మొక్కల ప్రాధాన్యతను వివరించిన తీరు అమోఘమని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు, సెకండ్ హాఫ్‌లో అసలు కథలోకి వెళ్లాడట. ఇక అక్కడి నుంచి మూవీ స్థాయి పెరిగిపోయిందని టాక్.

క్లైమాక్స్ అయితే చాలా బాగుందని అంటున్నారు. దర్శకుడు కథ, కథనాలతో కట్టిపడేశారట. అయితే ఇలాంటి మూవీ బి, సి సెంటర్లలో ఆడటం కష్టమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉన్నా అది మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుందని అంటున్నారు. మాస్ ప్రేక్షకులు ఈ మూవీను పెద్దగా ఆదరించరని టాక్. మరి నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిన మొదటి మూవీ బాక్సాఫీసు వద్ద కాసులు కురిపిస్తుందో.. లేదో.. చూడాలి మరి.

Continue Reading

Movie Reviews

తొలిప్రేమ మూవీపై కత్తి మహేష్ రివ్యూ : నేనింతే

Published

on

వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ‘తొలిప్రేమ’ మూవీకి పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. అయితే ప్రతి శుక్రవారం విడుదలయ్యే కొత్త సినిమాలకు తనదైన శైలి రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ‘తొలిప్రేమ’ మూవీకి రివ్యూ ఇచ్చేశాడు.

‘ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన ప్రేమకథా మూవీలో ‘తొలిప్రేమ’ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటు పొగడ్తల వర్షం కురిపించాడు. ముఖ్యంగా దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ. మణిరత్నం, శేఖర్‌కమ్ముల స్టైల్‌ను కలగలిపితే వెంకీ అట్లూరి అని దర్శకుడిని కత్తి మహేశ్ ఆకాశానికెత్తేశాడు. బ్రిలియంట్ రైటింగ్‌తో సాగిన కథలో నటీనటులు అద్భుతంగా చేశారని. వరుణ్ తేజ్, రాశీఖన్నా ఆకట్టుకునే నటనను ప్రదర్శించారన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం తరువాత హీరోయిన్ రాశీఖన్నా అద్భుతనటనను కనబరిచిందన్నారు. మొత్తానికి ‘తొలిప్రేమ’ దూసుకుపోవడం ఖాయమే’ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు మహేష్ కత్తి.

ఇదిలాఉంటే నిన్న విడుదలైన సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ మూవీకి. నవ్వు రాని కామెడీ, లవ్ లేని రొమాంటిక్ ట్రాక్‌తో అన్ ఇంటిలిజెంట్ స్టోరీ, నువ్వు ఇంటెలిజెంట్‌వి అయితే, నేను ష్యూర్‌గా చెప్పగలను నువ్వు తెలివైన నిర్ణయం తీసుకుంటావు’ అని షాకింగ్ రివ్యూ ఇచ్చిన మహేష్ కత్తి. ‘తొలిప్రేమ’కు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

Continue Reading

Movie Reviews

తొలిప్రేమ మూవీ ట్విట్టర్ రివ్యూ : అదరగొట్టిన వరుణ్ తేజ్, రాశి ఖన్నా

Published

on

మెగా అభిమానులను మరోసారి ‘ఫిదా’ చేస్తున్నాడు వరుణ్ తేజ్. రాశీ ఖన్నాతో కలిసి ‘తొలిప్రేమ’ శనివారం నాడు థియేటర్స్‌లో సందడి చేసేందుకు వచ్చేశాడు వరుణ్ తేజ్. ‘తొలిప్రేమ’ టైటిల్ అనౌన్స్‌తోటే క్యూరియాసిటి పెంచేసిన వరుణ్ టీజర్, ట్రైలర్‌లతో ఈ మూవీపై అంచనాలు వచ్చేట్టు చేశాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ‘తొలిప్రేమ’ మూవీకి పాజిటివ్‌గా ట్వీట్ల వర్షం కురుస్తోంది ట్వీట్టర్‌లో.

ఓవర్సీస్ నుండి ‘తొలిప్రేమ’కు అద్భుతమైన పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ‘తొలిప్రేమ’పై ప్రేక్షకులు కురిపిస్తున్న ‘ప్రేమ’కు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు హీరో వరుణ్ తేజ్.

ఇప్పుడే ‘తొలిప్రేమ’ చిత్రాన్ని చూశా. సూపర్ లవ్ జర్నీ అంటూ ట్వీట్ చేశారు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి. వరుణ్, రాశీఖన్నా ఆక్టింగ్ అదుర్స్, వెంకీ అట్లూరి తొలి సినిమాతోటే హిట్ అందుకున్నారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సూపర్. ఓవరాల్‌గా ‘తొలిప్రేమ’ టీమ్ సక్సెస్ అంటూ ట్వీట్ చేశారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: