Connect with us

Health

గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందమే కాదు, ఎన్ని ఆరోగ్య ప్రయేజనాలు ఉన్నాయే తెలుసా?

Published

on

henna leaves

గోరింటకు: భారతీయ సంస్కృతి కి నిదర్శనంగా పూర్వం నుండి ఇప్పటి వరకు మహిళలకు ఇష్టమైనది గోరింటాకు .భారతీయ ఆడవాళ్లకు గోరింటాకు అంటే చెప్ప‌లేనంత ఇష్టం. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికి మన వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. పెళ్ళికి నెలరోజుల ముందు నుండే మెహంది పండగ చేస్తుంటారు.పెళ్లి అనే కాదు ఏ పండగ వచ్చిన చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు ఆడవాళ్లు .ప్రతి పండగకు ఆడవాళ్ళ చేతులకు అందం గోరింటాకు.మన దేశంలోనే కాదు. విదేశీ వనితలకు కూడా గోరింటకు అంటే చాల ఇష్టపడతారు. పండగలంటే ఆడవాళ్ళకి గుర్తొచ్చేది గోరింటకు.

గోరింటాకు ఎర్ర‌గా పండాలంటే: గోరింటాకు ఎర్రగా పండాలంటే.. కొన్ని టిప్స్ ని ఉపయోగిస్తే మంచి రిసల్ట్ ఉంటుంది. ముందుగా శుభ్రంగా ఉన్న చేతులపై గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెట్టుకోవడానికి ముందు సోప్ వాటర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల గోరింటాకు ఎక్కువ టైమ్ మీ చేతులపై ఉంటుంది.. బాగా పండుతుంది. గోరింటాకు పెట్టుకున్న తర్వాత చేతులపై నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమం కాటన్ తో అద్దుకోవాలి. దీనివల్ల డిజైన్ ఆరిపోకుండా, రాలిపోకుండా ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రస్ ఎర్రగా పండటానికి సహాయపడుతుంది.

గోరింట‌తో ఎంతో మేలు: గోరింటాకు పెట్టుకుంటే మహిళలు ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే గోరింటాకు అందానికేకాదు మన ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందంట. గోరింటాకులో ఉండే ఔషధగుణాలు మన శరీరాన్ని రక్షించి, ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది . కంటికి కనిపించని సూక్ష్మక్రిములను గోరింటాకు నాశనం చేస్తయంట. ఆటలమ్మ సోకేటప్పుడు శరీరంపై వచ్చే మచ్చలకు గోరింటాకు రాయడం వలన ఆ మచ్చలు  తగ్గుతాయంట. అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళకు, వేళ్లకు ఉండే ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేస్తాయంట . అంతేకాదు శరీరంపై ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు గోరింటాకు ముద్దగా చేసి గాయాలకు రాస్తే, మంచి రిసల్ట్ ఉంటుంది. గోరింటాకు ముద్ద తలకు రాసుకుంటే చుండ్రు సమస్యను దూరంచేసి జుట్టు బలంగా తయారవడానికి సహాయపడుతుందంట. మృదువైన, ఒత్తైన జుట్టును అందిస్తుంది.

ఉపయోగాలు:

  1. గోరింటాకు రసాన్ని,చక్కర కలుపుకొని తాగినట్లయితే మంటతో కూడిన మూత్ర విసర్జన సమస్య మరియు మలబద్దకాన్ని తగ్గించవచ్చు.
  2. గోరింటాకు ఆకులతో కషాయం కాసి,కాలిన దెబ్బలపై వేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది.
  3. గోరింటాకుని ముద్దగా చేసి ,అందులో కొద్దిగా నూనె మరియు తుమ్మ జిగురు కలిపి కణతల మీద పెట్టుకుంటే తల నొప్పి తగ్గుతుందంట.
  4. ఒక గ్లాసు పాలలో అందులో రెండు చెంచాలు గోరింటాకు రసాన్ని కలిపి తాగితే చలి జ్వరము తగ్గుతుందంట.
  5. దంత సమస్యలకు మరియు చిగుళ్లలో రక్తం కారుటకి గోరింటాకు కషాయాన్ని నోటిలో వేసికొని పుక్కిలిస్తే మంచి రిసల్ట్ ఉంటుంది.

Latest News

Trending

%d bloggers like this: