Connect with us

Technology

మధ్య తరగతి వారికీ అద్భుతమైన అవకాశం, “200కి.మీ. మైలేజ్”వచ్చే టూవీల‌ర్లు..!

Published

on

టూవీల‌ర్ల అభిమానులకు మంచి శుభవార్త, అదేంటే కేవలం సామాన్యులకు అందుబాటు ధరలోనే ఉండే ఈ టూవీల‌ర్ల ఎంత మైలేగ్ ఇస్తుందో తెలుసా ..!మీ ఉహకు కూడా అందని విధంగా ఏకాగం ఒక్క‌సారి ఛార్జీంగ్ తో 175 నుంచి 250 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఇండియ‌న్ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల మార్కెట్ లో శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతున్న ఒకిన‌వ టూవీల‌ర్ల సంస్థ స‌రికొత్త టూవీల‌ర్ ను తయారు చేసింది.

పెట్రో స్కూట‌ర్ల‌కు ధీటుగా పోటీనిచ్చే ఒకిన‌వ తాజాగా విడుద‌ల చేసిన స్కూట‌ర్ల ధ‌ర 59,889 రూపాయ‌లు. గ‌త‌ ఏడాదిలో రెడ్ పేరిట స్కూట‌ర్ ను రిలీజ్ చేసిన ఆ సంస్థ‌, ఇప్పుడు ప్లైజ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను లాంచ్ చేసింది.ఒకిన‌వ సంస్థ ప్రైజ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను ప్రీమియం మోడ‌ల్ గా తయారుచేసింది. అత్యుత్త‌మ ఫ‌ర్ పామెన్స్, అత్యాధునిక ఫీచ‌ర్లు దీని సొంతం. ఈ స్కూట‌ర్ కు ముందు డిజైన్ లో ఆక‌ర్ష‌ణీయ‌మైన హెడ్ ల్యాంప్. ప‌గ‌టిపూట వెలిగే ఎల్ ఈడీ లైట్లు ఉన్నాయి. ఇక ఈ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ లో వెయ్యి వాట్స్ కెపాసిటీ గ‌ల ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం క‌ల‌దు. ఇది గ‌రిష్టంగా 3.35 వీహెచ్ పీ ప‌వ‌ర్ విడుద‌ల చేస్తుంది.

ఒకిన‌వ ప్లైజ్ స్కూట‌ర్ గ‌రిష్ట వేగం గంట‌కు 75కిలోమీట‌ర్లుగా ఉంది. దీని ప్ర‌కారం చూసుకుంటే ప్ర‌స్తుతం ఇండియ‌న్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న స్కూట‌ర్ లో అత్య‌ధిక వేగం ఉన్న స్కూట‌ర్ ఇదే. ఒక్క‌సారి ఛార్జీంగ్ తో 175 నుంచి 250 కిలోమీట‌ర్లు వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. అలాగే ఒక కిలోమీట‌ర్ కు కేవలం 15 పైస‌లు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంద‌ని ఒకిన‌వ సంస్థ వాళ్ళు తెలిపారు. ఈ స్కూట‌ర్ కు విద్యుత్ యాసిట్ బ్యాట‌రీ నుండి అందుతుంది.ఈ బ్యాట‌రీ ఆరుగంట‌ల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అతి త్వ‌ర‌లో అయాన్ బ్యాట‌రీతో మ‌రో స్కూట‌ర్ త‌యారుచేయ‌నున్న‌ట్లు ఒకిన‌వ సంస్థ‌ పేర్కొంది. కేవ‌లం రెండు గంటల్లోనే ఈ బ్యాట‌రీ చార్జింగ్ అవుతుంద‌ట‌. దాని ధ‌ర ఈ స్కూట‌ర్ కంటే ఆరు వేల రూపాయ‌లు ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఒకిన‌వ ప్రీమియం స్కూట‌ర్ లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. సైడ్ స్టాండ్ సెన్సార్, యాంటీ సెప్ట్ మెకానిజం లాంటి అనే ఫ్యూచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా డిజిట‌ల్ ఇన్ స్ట్రూమెంట్స్, అంతేకాకుండా 9.5 లీట‌ర్ల అండ‌ర్ సీట్ స్టోలేజ్ క‌ల‌దు. ఈ స్కూట‌ర్ లో వెనుక వైపున రెండు డిస్క్, ముందుప‌క్క‌న సింగిల్ డెస్క్ బ్రేకులు ఉన్నాయి. ఈ బ్రేకుల మీద ఎల‌క్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్ట‌మ్ ఉంది. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 12 అంగుళాల‌ వీల్స్ మీద ప‌రుగులు పెడుతుంది.ఈ స్కూట‌ర్ ను బుక్ చేసుకునేందుకు న‌వంబ‌ర్ 27 నుంచి బుకింగ్స్ ఆహ్వానించింది ఒకిన‌వ సంస్థ‌. రెండు వేల రూపాయ‌ల‌తో దీనిని బుక్ చేసుకొవ‌చ్చు. బుక్ చేసుకున్న వారికి ఈ నెల చివ‌రి నుంచి అందించ‌నుంది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా 106 విక్ర‌య కేంద్రాలు ఉన్నాయి. 2018 లో మ‌రో 150 షోరూమ్ ల‌ను తెరిచేందుకు ఆ సంస్థ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: