Connect with us

Health

ఎయిడ్స్‌ను‌ మించి‌ ప్రమాదకరంగా మారిన ఓ సుఖవ్యాధి

Published

on

సెగవ్యాధి లేదా గనేరియా ఒక విధమైన అంటు వ్యాధి. ఇది నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా వలన వస్తుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం. సంభోగం లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు.. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో పెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ కూడా రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు వస్తాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి.

అనేక సాంక్రామిక సుఖవ్యాధుల్లో బాగా వణికించేది, ఒకసారి అటాక్ చేస్తే ఇక నయం కానిది ఎయిడ్స్. అఫ్ కోర్స్, కొన్ని హోమియో ప్రయోగాలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి, కానీ అల్లోపతి ఇప్పటికీ మందు కనుక్కోలేకపోయింది. కేవలం లైఫ్ ఎక్స్‌టెండ్ చేసే చికిత్సలు తప్ప. అయితే ఇప్పుడు గనేరియా అనే సుఖవ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారుతున్నది. దీనికి కారణమయ్యే బ్యాక్టీరియా ‘సూపర్ బగ్‌’గా మారి మన మెడికల్ పరిశోధనలనే సవాల్ చేస్తున్నది.

ఏటా కోట్ల మందికి సోకుతున్న ఈ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా హెచ్చరించింది. ఇప్పుడు మార్కెట్‌లోని అన్ని మందులనూ హరాయించుకునే స్థితికి చేరుకున్న ఈ బ్యాక్టీరియాను అదుపు చేసేందుకు కొత్త మందులేవీ లేవు. మూడు మందులు ప్రయోగదశలోనే ఉన్నాయి, ఎప్పుడు సఫలమవుతాయో తెలియదు. ఈలోపు ఆ బ్యాక్టీరియా మన బలమైన యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగనంతగా ఇంకెంత బలం పెంచుకుంటుందో.?

ఈ వార్త కూడా మెయిన్ స్ట్రీమ్‌ మీడియాకు పట్టలేదు. మన ఉస్మానియా, మన గాంధీ శాస్త్రవేత్తలతో కలిసి పూణెలోని జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఓ ప్రయోగం, ఓ పరిశోధన చేసింది. ఢిల్లీ, పూణె, ముంబై, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని అనేకమంది గనేరియా రోగులపై ఈ పరిశోధన. వీరి పరిశోధనలో తేలిందేమిటంటే..? దాదాపు 124 గనేరియా స్ట్రెయిన్స్ మందులకు లొంగని స్థాయిలో నిరోధకతను పెంచేసుకున్నాయి. మొదటితరం యాంటీ బయాటిక్స్ అయితే దాదాపుగా పనిచేయడం లేదు. సిప్రోఫోక్సాసిన్‌కు 98 శాతం ఐసోలేట్లు లొంగడం లేదు. పెన్సిలిన్‌కు 52 శాతం, టెట్రాసైక్లిన్‌కు 56 శాతం, అజిత్రోమైసిన్‌కు 5 శాతం.

ఇలా చివరకు స్పెక్టినోమైసిన్, సెఫ్ట్రియాగ్జోన్, సెఫిగ్జయిమ్. వీటికీ లొంగకుండా మారిపోతున్నాయి. నిజానికి రెండు దశాబ్దాలుగా ఈ వ్యాధి విస్తరిస్తున్నది. గతంలో యాంటీ బయాటిక్స్ బలంగా పనిచేసిన దశలో ఈ వ్యాధిని డాక్టర్లు నయం చేసేవారు. మరి ఇప్పుడు..? సెఫ్ట్రియాగ్జోన్, సెఫిగ్జయిమ్‌కు కూడా లొంగడం లేదంటే మరి ఇంకా పవర్ ఫుల్ యాంటీ బయాటిక్ కావాలి. కానీ మూడు రకాలు ఇప్పుడు ప్రయోగదశలో ఉన్నాయి. ఎడాపెడా యాంటీ బయాటిక్స్ వాడేయడం వల్ల వచ్చిన దుస్థితి ఇది. మరిప్పుడు మార్గం. నివారణ. అవును. నివారణే అత్యుత్తమ మార్గం. సేఫ్ సెక్స్.!

Latest News

Trending

%d bloggers like this: