Connect with us

Movie News

ప్రదీప్ గురించి ఈ అమ్మాయి చెప్పే మాటలు సోషల్ మీడియానే భయపడేలా చేసింది..!

Published

on

మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికిన వారిలో టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో పోలీసులు ప్రదీప్‌ కారును ఆపి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు చేయగా.. బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ 178గా నమోదైంది. సాధారణంగా 35 బీఏసీ దాటితేనే పరిమితికి మించి మద్యం తాగినట్లు పరిగణిస్తారు.

దీంతో పోలీసులు ప్రదీప్‌ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. బీఏసీ స్థాయి 35 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే కేసులు, జరిమానాలతో సరిపెడతారు. 150 పాయింట్లు దాటితే మాత్రం రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. కాగా, డ్రంకెన్‌డ్రైవ్‌ ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌పై ప్రదీప్‌ గతంలో చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ ఘటన పై ప్రదీప్ స్నేహితురాలు స్పందించింది. అది కూడా చాలా ఘాటుగా… ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంతలా పెద్దది చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదని, తను కూడా అందరిలాంటి వాడేనని సరదాలు అందరిలాగే ఉంటాయని… అయినా ఆరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్కువైంది. అంతే దీనికే ఇంత రచ్చచేయాలా..అంటూ నేటిజన్లపై విరుచుకు పడింది.

ఇలా పెద్దది చేసి ముఖ్యంగా వాళ్ళ తలిదండ్రులను చాలా బాధ పెడుతున్నారు…ఇలా చానెల్స్ లో పబ్లిసిటీ చేయడం వల్ల, ఆ వీడియో లు పదే పడే చూపించడం వల్ల తనకున్న ఇమేజ్ దెబ్బతింటుంది…పెద్ద పెద్ద వాళ్ళు చేసినపుడు ఇంతగా దుమారం రేపరు గాని, ఒక్కసారి పట్టుబడినందుకే వైరల్ చేస్తున్నారు….ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: