Connect with us

Movie News

మంచి ఆధ్యాత్మికత, దేశభక్తి, ఆడవాళ్ళ భద్రత గురించి చెప్పే గ‌జ‌ల్ శ్రీనివాస్, అమ్మాయిలని ఎలా వాడుకునేవడో చూడండి.

Published

on

రేడియో జాకీగా ప‌నిచేసే ఓ యువ‌తిని లైంగిక‌ వేధింపుల‌కు గురి చేసిన‌ గాయ‌కుడు, ర‌చ‌యిత గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర్చి చంచ‌ల్ గూడ జైలుకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే..లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు.. ఆలయవాణి అనే వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తుంది. ఈ వెబ్‌ రేడియో గజల్‌ శ్రీనివాస్‌దే. బాధితురాలు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

ఆధ్యాత్మికత, దేశభక్తి, ఆడవాళ్ళ భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గజల్‌ శ్రీనివాస్‌ లైంగికవేధింపుల కేసులో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి మొత్తం ఆధారాలతోనే బాధితురాలు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.మహిళా రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన గజల్‌ శ్రీనివాస్‌ అలియాస్‌ కేసిరాజు శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. యాక్సిడెంట్‌ గాయాలతో బాధపడుతున్న నాకు ఆ అమ్మాయే మనస్ఫూర్తిగా మసాజ్‌ చేసిందని, అయితే ఆమె పట్ల తనకు ఎలాంటి చెడు ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌కే చెందిన ఆలయవాణి వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు బుధవారం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఆత్మసాక్షిగా చెబుతున్నాను. నేను మహిళల్ని గౌరవిస్తాను. ఆ అమ్మాయి మా సంస్థలోనే పనిచేస్తుంది. నామీద ఎందుకు ఫిర్యాదు చేసిందో నాకు అర్థం కావడంలేదు. కొద్ది రోజుల కిందట నాకు యాక్సిడెంట్‌ అయింది. దాని వలన బాడీలో కొన్నిచోట్ల కాల్షియమ్‌ పేరుకుపోయింది. దాన్ని నియంత్రించడానికి రెగ్యులర్‌గా మసాజ్‌ చేయించుకుంటాను. ఒకరోజు ఫిజిషియన్‌ రాకపోతె ఆ అమ్మాయే ముందుకొచ్చి.. మసాజ్‌ చేస్తానంది. నేను వద్దన్నా వినకుండా మసాజ్‌ చేసింది. నాకు ఆమెపట్ల ఎలాంటి చెడుఆలోచన లేదు.. అని గజల్‌ శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.

నేరానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించడంతోనే గజల్‌ శ్రీనివాస్‌కు నోటీసులు ఏలాంటివి ఇవ్వకుండా డైరెక్ట్ గ అరెస్టు చేశామని పంజాగుట్ట ఏసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. బాధితురాలు బయటి ఊరి నుంచి వచ్చి ఇక్కడ(హైదరాబాద్‌లో) ఓ హాస్టల్‌లో ఉంటూ గజల్‌ శ్రీనివాస్‌కు చెందిన రేడియోలో పనిచేస్తోంది. తాను లైంగిక, మానసిక వేధింపులకు గురయ్యానంటూ ఫిర్యాదు ఇవ్వడమేకాక.. దానికి సంబంధించి వీడియో, ఆడియో రికార్డులను కూడా బాధితురాలు అందించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 509ను అనుసరించి కేసులు నమోదుచేశామని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం గజల్‌ శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. 12 వరకు ఆయనకు రిమాండ్ విధించారు.

 

 

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: