Connect with us

Movie News

బయటపడిన గజల్ శ్రీనివాస్ అసభ్యకరమైన వీడియో.. ఎంత దారుణంగా ఉందో మీరే చుడండి.

Published

on

రేడియో జాకీగా ప‌నిచేసే ఓ యువ‌తిని లైంగిక‌ వేధింపుల‌కు గురి చేసిన‌ గాయ‌కుడు, ర‌చ‌యిత గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో హాజరు పరిచి చంచ‌ల్ గూడ జైలుకి త‌ర‌లించిన విష‌యం అందరికి తెలిసిందే.కాగా యువ‌తి పోలీసుల‌కు చూపించిన వీడియోలు, ఫొటోలు మీడియాకు దొరికాయి. అందులో బాధిత యువ‌తితో పాటు ప‌నిమ‌నిషితో గ‌జ‌ల్ శ్రీనివాస్ అసభ్యకరమైన చేష్ట‌లు చేస్తున్నట్లు ఉంది. త‌న‌ భుజానికి మాత్ర‌మే ఓ యువ‌తి మందు రాసింద‌ని ఇంకేమీ జ‌ర‌గ‌లేద‌ని గ‌జ‌ల్ శ్రీనివాస్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న చెప్పిన మాటలకూ బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియోలు మొత్తం వేరేగా ఉన్నాయి. ఈ వీడియోలను చూసినప్పటికీ గజల్ శ్రీనివాస్ ఆఫీసులో పనిచేసే కొందరు ఆడవాళ్లు ఆయనను వెనకేసుకొస్తున్నారు

.

గజల్ శ్రీనివాస్ ఆఫీసులో బెడ్ రూం ఏర్పాటు చేసుకుని అందులో మసాజ్ చేయించుకుంటాడని, లైంగిక ప్రేరణ కలిగేలా మసాజ్ చేయమని చెప్తాడని, పార్వతితో ఆయన చాలా సార్లు ఈ విధంగా చేయడం తాను చూశానని బాధితురాలు అరుణ కుమారి పోలీసులకు చెప్పింది.

ఎవరికీ చెప్పుకోలేని విధంగా తనను వేధింపులకు గురిచేశాడని, పార్వతి కూడా తనను ప్రలోభకు గురిచేసిందని, శ్రీనివాస్‌కు దగ్గరకు చేర్చేందుకు ఆమె ప్రయత్నించిందని, శ్రీనివాస్‌కు దగ్గరగా ఉండాలని చెప్పేదని తెలిపింది. ఈ విషయాలను బాధితురాలు పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు గ‌జ‌ల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. చాలా రోజులు గజల్ వేధింపులు భరించానని, గత్యంతరం లేని పరిస్థితిలో పోలీసులకు పిర్యాదు చేశానని, తాను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని బాధితురాలు చెప్పింది . ఇప్పుడు సోషల్ మీడియాలో గజల్ శ్రీనివాస్ అసభ్యకర వీడియో వైరల్ గా మారింది.

Latest News

Trending

%d bloggers like this: