Connect with us

Technology

ATMలో నకిలీ నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా

Published

on

ఒక‌ప్పుడంటే బ్యాంక్‌లో ఉన్న డ‌బ్బులు డ్రా చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి, ఫాం నింపి క్యాషియ‌ర్‌కి ఇస్తే కొంత సేపు వెయిట్ చేసిన త‌రువాత లైన్‌లో నిల‌బ‌డి డ‌బ్బులు తీసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అధునాతన సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు వ‌చ్చేశాయి. అవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ‌న‌కు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో డ‌బ్బులు డ్రా చేసేందుకు య‌త్నించిన‌ప్పుడు డ‌బ్బులు అకౌంట్ నుంచి క‌ట్ అయి కూడా మెషీన్ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే చిన్న కంప్లెయింట్ ఇచ్చి మ‌న డ‌బ్బును మ‌నం తిరిగి పొందేందుకు వీలుంది.

కానీ ఈ మ‌ధ్య ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తున్నాయి. వాటిని తీసుకున్న వినియోగ‌దారులు బ్యాంకుకు వెళ్తే బ్యాంక్ వారు త‌మ‌కేం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం, దీంతో బాధితులు కేకలు పెట్ట‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది. అయితే మీకు తెలుసా? ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌చ్చినా వాటిని తిరిగి ఇచ్చి బ్యాంకుల ద్వారా అస‌లైన నోట్లు పొంద‌వ‌చ్చ‌ని. మీరు విన్న‌ది నిజ‌మే. ఇలాంటి స‌మ‌స్య ఎదుర‌య్యే వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఏటీఎంలో న‌కిలీ నోట్లు రాగానే బయప‌డ‌కూడ‌దు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అక్క‌డ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఇటీవ‌లి కాలంలో దాదాపు అధిక శాతం ఏటీఎంల వ‌ద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబ‌ట్టి న‌కిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విష‌యం చెప్పి అత‌ని వ‌ద్ద ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు డ్రా చేసిన మొత్తం, న‌కిలీ నోట్లు ఎన్ని వ‌చ్చాయి, ఏయే నోట్లు వ‌చ్చాయి, వాటి నంబ‌ర్లు, మీరు లావాదేవీ నిర్వ‌హించిన స‌మ‌యం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్‌సాక్ష‌న్ నంబ‌ర్‌ వంటి వివ‌రాలను అన్నింటిని ఆ రిజిస్ట‌ర్‌లో ఎంట‌ర్ చేసి గార్డు సంత‌కం తీసుకోవాలి.

వీలైతే ఇప్పుడు చెప్పిన వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌న్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసి భ‌ద్ర ప‌రుచుకోవాలి. అనంతరం పైన చెప్పిన ఆయా వివ‌రాల‌కు సంబంధించిన జిరాక్స్ ప్ర‌తుల‌ను తీసి బ్యాంక్‌కు వెళ్లి అక్క‌డి మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కూడిన ఓ లెట‌ర్‌ను రాసి మేనేజ‌ర్‌కు ఇవ్వాలి. దానికి ముందు చెప్పిన జిరాక్స్ ప్ర‌తుల‌ను కూడా ఇవ్వాలి. బ్యాంక్ వారు మీ ద‌గ్గ‌ర ఉన్న న‌కిలీ నోట్ల‌ను తీసుకుని వాటిని త‌మ ద‌గ్గ‌ర ఉండే ప‌రిక‌రాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్ల‌నే విష‌యాన్ని ధృవ ప‌రుస్తారు. అనంత‌రం వాటికి బ‌దులుగా మీకు అంతే మొత్తంలో డ‌బ్బును ఇస్తారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: