Connect with us

Health

మాంసం ఎక్కువగా తినడం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయి

Published

on

మాంసాహారం అతిగా లాగిస్తున్నారా? అధిక కెలోరీలు కలిగిన శీతల పానీయాలు రోజూ ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త!! వాటివల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత ముఖ్యమో, ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా అంతే ప్రమాదం. దీనివల్ల స్త్రీ, పురుషుల్లో పెద్ద పేగుల క్యాన్సర్ ముప్పు వచ్చే అవకాశం ఉంది.

బోస్టన్‌లోని హర్వార్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు గత 26 ఏళ్లుగా 1,21,050 మంది పురుషులు, స్త్రీల ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించారు. ఈ క్రమంలో ఆయా వ్యక్తులు తినే ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితులు గురించి అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా అతిగా మాంసం, అధిక కెలోరిలు కలిగిన శీతల పానీయాలు తాగేవారిలో పెద్ద పేగు క్యాన్సర్ ఏర్పడినట్లు గుర్తించారు. అలాగే శుద్ధి చేసిన ధాన్యాలను అతిగా తీసుకున్నవారిలో కూడా ఈ లక్షణాలు కనిపించినట్లు పేర్కొన్నారు.

ఏదైనా ‘అతి’ అనర్థదాయకం. కాబట్టి మాంసాహారమైనా, శాఖహారమైన సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేకపోతే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: