Connect with us

Health

ఈ గుణాలు మీకు కనిపిస్తే మీ లివర్ పాడవుతుందని అని అర్ధం ఆ గుర్తులెంటో తెలుసుకోండి

Published

on

symptoms of liver infection

కాలేయం ఇది మన శరీరంలో ఉండే అతి పెద్ద గ్రంథి. లివర్ శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపడంలో తోడ్పడుతుంది.లివర్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో, జీర్ణక్రియకు అవసరమైన రసాయనాలను విడుదల చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అంతేకాకుండా రక్తంలో ఉండే బాక్టీరియా,మృత కణాలను హానికర హార్మోన్లను కూడా లివర్ తొలగిస్తుంది. దీంతో లివరే కాకుండా,శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది.  అయితే లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో ఇతర అవయవాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. దీని వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.ప్రతి ఒక్కరు లివర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలి అంటే, లివర్ అనారోగ్యం బారిన పడినప్పుడు మనలో కనిపించే అనారోగ్య లక్షణాలను మనం తెలుసుకోవాలి. దీంతో లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి లివర్ అనారోగ్యానికి గురైందని తెలియజేసే ఆ లక్షణాలు ఏంటో చూడండి.

 

1. బాగా చలిలో ఉన్నపుడు శరీరానికి విపరీతమైన చెమట వస్తే లివర్ పాడయినట్టే. దింతో పాటు ఆ చెమట దుర్వాసన ఉంటుంది. అంతేకాకుండా నోరు దుర్వాసన వస్తుంటుంది, నాలుకపైన పసుపు రంగులోకి మారుతుంది, ఈ లక్షణాలు ఉంటే లివర్ అనారోగ్యంగా ఉందని అర్ధం.

  1.  గురక ఎక్కువగా పెట్టేవారికి లివర్ సమస్య ఉందని తెలుసుకోవాలి. లివర్ ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా చాలా మందిలో గురక ఎక్కువగా వస్తుంటుంది.
  2. గ్యాస్ సమస్యలు ,కడుపు నొప్పి బాగా ఉంటే లివర్ ఆరోగ్యంగా లేదని తెలుసుకోవాలి.అంతేకాకుండా ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా బరువు తగ్గకపోతే లివర్ పాడైనట్టు.
  3. లివర్ సరిగ్గా పనిచేయకపోతే తీవ్రమైన అలసట వస్తుంది. నీరసంగా ఉంటుంది. ఉదయం లేవగానే బద్దకంగా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి.
  4. లివర్ ఆరోగ్యాంగాలేని వారి శరీరం లేత పసుపు రంగులో కనిపిస్తుంది.దీంతోపాటు చర్మం దురద పెడుతుంటుంది,చర్మంపై ర్యాషెస్ వస్తాయి. కళ్ల కింద నల్లని వలయాలు వస్తాయి. కళ్లు ఉబ్బిపోయి ఉంటాయి.ముఖం ఉబ్బి ఉంటుంది.మొటిమలు బాగా వస్తాయి.
  5. మద్యం, పెర్‌ఫ్యూమ్ లేదా ఇతర కెమికల్స్ వాసన చూస్తే పడకపోయినా లివర్ పాడైందని అర్ధం.
  6. లివర్ సరిగ్గా లేనప్పుడు తలనొప్పి వస్తుంది,కోపం వస్తుంటుంది.
  7. లివర్ సరిగ్గాలేకపోతే జీర్ణ సమస్యలు వస్తుంటాయి. గ్యాస్, డయేరియా,మలబద్దకం అసిడిటీ తరచూ వస్తాయి.
  8. లివర్ బాలేకపోతే వచ్చే మరో సమస్య ఏంటంటే శృంగార సామర్థ్యం నశించడం. లేదంటే శృంగారంపై ఆసక్తి లేకపోవడం. లివర్ పనిచేయకపోతే హార్మోన్లు సరిగ్గా పెరగవు. వాటి క్రమబద్దీకరణ గాడి తప్పుతుంది. దీని వలన శృంగార సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

Health

సబ్జా గింజలు.. చలవే కాదు ఎంతో ఆరోగ్యం

Published

on

వేసవి కాలం వచ్చేసింది. బయటికెళ్లి వస్తే చాలు మాడు మాడిపోతుంది. ఒంట్లో వేడి పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం చాలా పానీయాలు తాగేస్తుంటాం. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది. కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే మనకు మంచి పానీయం ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా గింజలు చాలా మంచివి.

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

పానీయం తయారీ:

సబ్జా గింజలను నీళ్లతో కడిగి వాటిని శుభ్రంచేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగొచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకుని తీసుకోవచ్చు.

మలబద్ధానికి చెక్:

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

Continue Reading

Health

పెరుగుతో గుండె జబ్బులకు చెక్

Published

on

మీరు అధిక రక్తపోటు (హైబీపీ)తో బాధపడుతున్నారా అయితే ఆహారంలో రోజూ పెరుగు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరుగుతోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చని వారు అంటున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న 30 – 55 మధ్య వయసున్న 55వేల మంది మహిళలు, 40-75 మధ్య వయసున్న 18వేల మంది పురుషులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వారంపాటు.. రోజూ 60 మి.లీ పరిమాణంలో పెరుగు తినమని సూచించారు. వారం తర్వాత వీరిపై మళ్లీ పరిశోధనలు చేయగా… శాస్త్రవేత్తలకు సరికొత్త విషయాలు తెలిశాయి. పెరుగు తీసుకున్నవారిలో చాలా మందికి.. గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గినట్లు గ్రహించారు. మిగతావారిలోనూ ఈ అవకాశం చాలావరకు తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.

Continue Reading

Health

జామపండుతో జలుబుకు చెక్

Published

on

జలుబు మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా..? అయితే జామ పండు తినండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. జలుబుతో బాధపడేవారు జామ పండు తినొద్దని చాలామంది చెబుతుంటారు, కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే జామలో జలుబును తగ్గించే లక్షణాలున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన జలుబుతో బాధపడేవారు పెద్దసైజు జామకాయను తీసుకుని అందులో గింజలు తీసేసి తినాలి. తర్వాత గ్లాసు నీళ్లు తాగితే అది మందులా పనిచేసి గొంతులోనూ, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తోంది. దీంతో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఒక్క జలుబె కాదు. ఇతర ఆరోగ్య సమస్యలకూ జామ మంచి పరిష్కారంగా పనిచేస్తోంది:

* జామ నుంచి లభించే పీచు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. వీరు జామకాయను నిరభ్యంతరంగా తినవచ్చు.

* జామకాయలో ఉండే బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

* తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లమ్ తో బాధపడేవాళ్లు పచ్చిజామకాయను ముద్దలా నూరి, రోజులో మూడునాలుగుసార్లు నుదుటిమీద పెట్టుకుంటే పెయిన్ తగ్గుతుంది.

* గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతోంది.

* ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి నొప్పి ఉన్నచోట పెడితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

* జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ ఉంటుంది. వృద్ధాప్య‌ చాయలను దూరం చేస్తోంది.

* జామలో ఉంటే కాపర్, థైరాయిడ్ సమస్యలకు మంచి పరిష్కారం ఉంటుంది.

* జామ ఆకు రసాన్ని వెన్నెముక మీద రాస్తే మూర్ఛవ్యాధి సమస్య ఉన్నవారు ఉపశమనం పొందుతారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: