Connect with us

Political News

డేరాబాబా జైలులో ఉండటంతో ఇప్పుడు శిష్యుడు సెక్స్ రాకెట్ గుట్టు బయట పెట్టిన పోలీసులు

Published

on

ఆశ్రమంలో తాను కోరుకున్న అమ్మాయిని వశపరచుకునేందుకు  ఆయన ఏకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని ఒప్పించే విధంగా విషకన్యలు అనే గ్రూప్‌ ఉండేది. ఈ బృందంలోని మహిళలు డేరాలోని అందమైన యువతులను తమ వలలో వేసుకునే వారు. రామ్ రహీం అంతరంగ మందిరానికి తీసుకు వెళ్లే వారు. ఈ విషకన్యలు గుర్మీత్‌ సింగ్‌ కు అత్యంత దగ్గరగా మెలుగుతుంటారు.
కానీ ఇప్పుడు గురువు గుర్మీత్ రామ్ రహీం అత్యాచార కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు.. తాజాగా అతని శిష్యుడు ఒకడు పశ్చిమ బెంగాల్ లో నడుపుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రమోద్ సింఘానియా అనే అతను కోల్ కత్తా లో బుర్రా బజార్ తన బిల్డింగ్స్ లో వేశ్య గృహాలను నడుపుతున్నాడు.. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శుక్రవారం దాడులు నిర్వహించారు. అయితే నిందితుడు మరో మైనర్ బాలిక తో కలిసి రహస్య సొరంగం గుండా అక్కడి నుండి పారిపోయాడు. సొరంగం కనిపించకుండా నింరించిన చెక్క డోర్ పై దుస్తులు కప్పి ఉండదాన్ని పోలీసులు గుర్తించారు. ఆ భవనంలోని ఓ అంతస్థులో చెక్కలతో 25 క్యాబిన్లు నిర్మించి వాటిలో బెడ్ వేసి ఉంచినట్లు తెలుస్తోంది.
ఓ వుడెన్ క్యాబిన్ లో స్త్రీ పురుషు జంటలు అసభ్యకరమైన స్థితిలో ఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ వ్యభిచారం జరుతున్నట్లు తెలిసింది. పోలీసుల రాకను చూసిన ప్రమోద్ సింఘానియా ప్రత్యేక సొరంగ మార్గం గుండా పారిపోయాడు. దీంతో మరికొందరు మైనర్ బాలురు, బాలికలను గుర్తించి అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: