Connect with us

Political News

నూనెలో ఫ్రై చేసిన తర్వాత కూడా ఈ చేప బతికింది

Published

on

బాగా కాగే నూనెలో వేసి మాడి మసికావడానికి కాస్త ముందు బయటకు తీయడాన్నే ఫ్రై అంటారు. ఇక కోసి కారం, మసాలాలు దట్టించి కళ్లాయిలో వేసి తీసి తింటే అబ్బా అసలే చలికాలం నోరూరించమాంకండి అని మాత్రం అనకండి. ఇక అలా ఫ్రై చేసిన చేప నోటిదాక వచ్చాక నోరు తెరిచిందనుకోండి…

కెవ్వుమని కింద పడేయడం మినహా మనకు ఇంకో ఆప్షన్ ఉండదు కదూ. ఫ్రై చేసిన చేప బతికిందని చెబితే అసలు నమ్మరనుకోండి కానీ ఈ కింది వీడియో చూస్తే అవును నిజమేగా అని మీరే అంటారు. దక్షిణ చైనా లోని హెంగ్యాంగ్ నగరంలో ఈ వింత వీడియో బయటకు వచ్చింది. వీబో, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్స్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ చేపను బాగా ఫ్రై చేసుకొని తీసుకొని వచ్చారు. ఆ చేపను ఒక టేబుల్ మీద పెట్టగా అది కదలడం మొదలుపెట్టింది.

అలా కదులుతూ కదులుతూ చివరికి దాని పొట్ట కూడా విడిపోయింది. ఆశ్చర్యకరమైన ఈ వీడియోలో ఓ మహిళ అరుస్తూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఎలాగూ ఫ్రై చేస్తారు కదా చేసే ముందు చంపొచ్చు కదా అని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు.

 

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Political News

అభిమానులూ ఇలా చేయండి అంటూ ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్

Published

on

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రోద్బలంతో నటి శ్రీరెడ్డి తన తల్లిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పవన్.. టీవీ9, ఏబీఎన్, టీవీ5 అధినేతలపై నిప్పులు చెరిగారు. తన తల్లిపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే.. వాటిని ఖండిచకుండా వ్యాపారానికి వాడుకున్నారని విమర్శించారు.

ఆ తర్వాత మెగా ఫ్యామిలితో కలిసి ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు మీడియాపై ఆగ్రహంతో వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి పలు ప్రకటనలు చేశారు.

‘‘శ్రీనిరాజుకు టీవీ9లో పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు, అతనికి సత్యం రామలింగరాజు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కూడా సంబంధాలున్నాయి’’ అని పవన్ ట్వీట్ చేశారు.

‘‘శ్రీనిరాజు రేపు నా మీద పరవు నష్టం దావా వేయనున్నారు. జనసైనికులారా మీరెవ్వరూ ఆవేశపడొద్దు. ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దు. నేను కూడా ఆయా చానెళ్ల అధినేతలతో శక్తివంతమైన న్యాయపోరాటానికి రెడీ అవుతున్నాను. అని మరో ట్వీట్‌లో చెప్పారు.

బాయ్‌కాట్ టీవీ9, టీవీ5, ఏబీఎన్’:
‘‘మన తల్లులు, కూమార్తెలు, చెల్లెళ్లలను దుర్బషలాడుతున్న టీవీ9, టీవీ5, ఏబీఎన్‌లను బాయ్‌కట్ చేయండి. నిస్సహాయ సోదరి, నగ్నత్వం, అసభ్యతతో వ్యాపారం చేస్తున్న వాళ్లను సైతం మనం బాయ్‌కట్ చేయాలి’’ అని పవన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.

Continue Reading

Movie News

పవన్ ఉగ్రరూపం: ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన, మీడియా వాహనాలు ద్వంసం

Published

on

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి రేపిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గొడవలో తనకు ఎలాంటి సంబధంలేకపోయినప్పటికీ.. తనను తన తల్లిని దూషించిన వారిపైన, వెనకునుండి ఈ కుట్రను జరిపిస్తున్నవారిపైన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను గుప్పిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగారు.

ఇండస్ట్రీ పరువు తీసే విధంగా మీడియాలో ఇంత రాద్దాంతం జరుగుతుంటే పట్టించుకోకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ డైరెక్ట్‌గా ఫిల్మ్ ఛాంబర్‌కే వెళ్లారు పవన్. దాదాపు రెండు గంటల పాటు పవన్ ఛాంబర్‌లో మెగా ఫ్యామిలీ, ఇతర సినీప్రముఖులతో సమావేశం అయ్యారు. పవన్ ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే మెగా బ్రదర్ నాగబాబుతో పాటు మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్‌కి చేరుకోగానే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. పవన్ పవన్ కళ్యాణ్‌పై కుట్ర పూరితంగా కథనాలను ప్రసారం చేస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ వాహనాలను ద్వంసం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసుల విజ్ఞ‌ప్తి మేరకు పవన్ ఫిల్మ్ ఛాంబర్‌ను వీడారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో ఎలాంటి చర్చలు జరిపారు. పవన్ డిమాండ్లు ఏంటి? మెగా హీరోలు మూకుమ్మడిగా ఎందుకు వచ్చారు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలతో ఎలాంటి చర్చలు జరిపారు? పవన్ కళ్యాణ్ వెంట న్యాయ నిపుణులు రావడం తదితర అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు ఆయన దీక్షకు కూడా దిగుతారని వార్తలు వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఫ్యాన్స్ ప్రధాన కూడళ్లలో నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్‌పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. పవన్ తల్లికి బహిరంగం క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏం జరగబోతోందనే ఉత్కంఠగా మారింది.

Continue Reading

Political News

హ్యాపీ బర్త్ డే అమ్మా: భావోద్వేగ ట్వీట్ చేసిన మహేష్

Published

on

‘భరత్ అనే నేను’ మూవీ విడుదల సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ‘భరత్ అనే నేను’ మూవీ తనకు ఎంతో ప్రత్యేకమైనదని.. ఎందుకంటే ఈ మూవీ తన తల్లి జన్మదినం రోజున విడుదల కావడం చాలా ఆనందంగా ఉందంటూ ప్రేక్షకులతో తన అనుభూతిని పంచుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ తల్లి ఇందిర దేవి అపురూపమైన ఫోటోని ట్విట్టర్‌‌లో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అమ్మా.. ‘భరత్ అనే నేను’ ఇన్ సినిమాస్ నౌ’.. ‘ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన మూవీను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటూ మహేష్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో మహేష్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇందిర దేవి ఫోటోను విపరీతంగా షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారింది.

It is overwhelming for me to present a film so close to my heart on this special day. Happy Birthday, amma 🙂 🙂
Bharat Ane Nenu in cinemas now.  అని మహేష్ బాబు ట్వీట్ చేసాడు.

 

 

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: