Connect with us

Movie News

ఇది విన్నారా గురు! అనిరుద్ కూడా కాపీ కొట్టేశాడట

Published

on

anirush trivikram

సౌత్ ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో అనిరుద్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి లేటెస్ట్ జనరేషన్ కి ఎలాంటి ట్యూన్స్ ఇవ్వాలో చాలా బాగా తెలుసు. సినిమాలకు తగ్గట్టు స్నాగితం అందించడంలో అనిరుద్ స్టైలే వేరు. కొంచం కూడా గ్యాప్ లేకుండా ప్రస్తుతం కోలీవుడ్ లో మూవీస్ చేస్తున్నాడు. అయితే దిగ్గజ సంగీత దర్శకుడికైనా అప్పుడప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ రాకుండా ఉండదు.

ఇతర సాంగ్స్ కి వీళ్లు కంపోజ్ చేసిన ట్యూన్ కొంచెం మ్యాచ్ అయినా చాలు ట్రాల్స్ రావడం ఈ కాలంలో కామన్ అయిపోయింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి అనిరుద్ కి ఆ ఎఫెక్ట్ కొంచెం గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా కొలమావు కోకిల (కోకో) అనే మూవీ కోసం కంపోజ్ చేసిన ఒక సాంగ్ కాపీ అని తెలుస్తోంది. నయనతార – కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో కళ్యాణ వయసు అనే ఒక సాంగ్ ను కంపోజ్ చేసిన ట్యూన్స్ ఇంగ్లీష్ సాంగ్ గి మ్యాచ్ అవుతున్నాయి. సనన్స్ – డోంట్ లై అనే సాంగ్ మ్యూజిక్ ని అనిరుద్ కాపీ కొట్టేశాడ్రోయ్ అంటూ సోషల్ మీడియాలో నెటీజన్స్ ట్రాల్స్ చేయడం స్టార్ట్ చేశారు.

ఒకసారి ఆ రెండు పాటలని ని వింటే నిజమే అని అనిపించకుండా ఉండదు. కాపీ కొట్టాడు అని ఎన్ని కామెంట్స్ వస్తున్నా కూడా అనిరుద్ బాబు మాత్రం ఆ కామెంట్స్ పై నోరుమెదపడం లేదు. ప్రస్తుతం సౌత్ లో ఆ న్యూస్ వైరల్ గా మారింది. మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ ఈ విధంగా చేశాడు అంటే తెలుగు నెటీజన్స్ కూడా నమ్మలేకపొతున్నారు.

Latest News

Trending

%d bloggers like this: