Connect with us

Technology

10లక్షల కార్డులు రద్దు మీ పాన్ కార్డు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి

Published

on

మీ పాన్ కార్డు ఉందో…రద్దు చేసారో చూసుకోండి.
గడిచిపోయిన ఏడాది 10లక్షలకు పైగా పాన్‌ కార్డులను రద్దు చేసినట్లు భారతీయ ఆధాయపన్ను శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. మీ పాన్‌ ఆ జాబితాలో లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి అంటూ ఇప్పుడు ప్రకటన జారీ చేసి చావు కబురు చల్లగా చెప్పింది. నకిలీ పాన్‌కార్డులను ఏరివేయడానికి తాము సీరియస్ గా ప్రయత్నిస్తున్నటు చేసినట్లు తెలిపింది. తమ కార్డు నకిలీ కాదని నిరూపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత త్వరగా పాన్ ను ఆధార్‌తో జత చేయాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇప్పటికీ ఇంకా ఈ లింక్ పూర్తి చేయని వారికి మార్చి 31, 2018 వరకూ గడువు ఉంది.
డూప్లికేట్‌ పాన్‌లను గుర్తించే ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్లే నిర్వహిస్తాయి కాబట్టి, కొన్నిసార్లు చిన్నతప్పుతో పాన్‌ రద్దు అయ్యే అవకాశం ఉంది. ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటు https:///incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి.. అక్కడ ఉన్న Know Your PAN అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. అక్కడ అవసరమైన వివరాలను ఇవ్వడంతోపాటు, మీ మొబైల్‌ నెంబరును ఎంటర్ చేస్తే.. OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత.. మీరు తెలిపిన అన్ని వివరాలూ సరిగ్గా ఉంటే. మీ పాన్‌ ఆక్టివ్‌ గా ఉందా లేదా.. అనే సమాచారం తెలుస్తుంది. ఆక్టివ్‌గా ఉంటే ఇబ్బందేమీ లేదు.
ఒకవేళ బ్లాక్‌ అయినా లేదా డీఆక్టివేట్‌ అయ్యిందని సమాచారం వస్తే.. మీ పరిధిలోని ఆదాయపు పన్ను శాఖ అసెసింగ్‌ ఆఫీసర్‌ (ఏఓ)కు మీ పాన్‌ ఆక్టివేట్‌ చేయాల్సిందిగా లేఖ రాయాలి. దీనికి ఆదాయపు పన్ను శాఖను ఉద్దేశించి ఇండెమ్నిటీ బాండ్‌ను సిద్ధం చేయాలి. మీ దగ్గర ఉన్న పాన్‌ కార్డు నకలును, గత మూడేళ్లుగా సమర్పించిన ఆదాయపు పన్ను రిటర్నుల నకళ్లనూ దీనికి జత చేయాలి. అన్నీ సవ్యంగానే ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరించుకుంటే.. 10-15 రోజుల్లో మీ పాన్‌ తిరిగి చెల్లుబాటులోకి వస్తుంది అని ఆదాయపు శాఖ చెబుతోంది.
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: