Connect with us

Technology

మీ గ్యాస్ సబ్సిడీ బ్యాంకులో పడుతుందో లేదో ఇలా చెక్ చేసుకోండి

Published

on

ఇప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది. మనం బుక్ చేయగానే గ్యాస్ అయితే వస్తోందిగాని సబ్సిడీ సక్రమంగా బ్యాంకులో పడుతుందో? లేదో? అన్న ఆందోళన. బ్యాంకు ఎకౌంట్ కు మొబైల్ అలర్ట్ ఉన్న ఖాతాదారులకు ఓకే. కాని చాలా మంది బ్యాంకు ఎకౌంట్ హోల్డర్స్ మొబైల్ అలర్ట్ పెయిడ్ సర్వీస్ ను మెయింటైన్ చేయరు. అలాగే కొందరి ఎకౌంట్లలో సబ్సిడీ జమవుతూనే సడెన్ గా ఆగిపోవచ్చు. అసలు ఇలా ఎందుకు జరిగిందనే విషయం తెలుసుకునేందుకు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుండి చెక్ చేస్తే చాలు.

ఎప్పుడూ పడే గ్యాస్‌ రాయితీ ఈ సారి పడలేదు అనగానే మొదట వేరే బ్యాంకు ఎకౌంట్ కు కొత్తగా ఆధార్‌ నంబర్‌ జత చేశారేమో చూసుకోవాలి. నిత్యం వాడే ఎకౌంట్ కాకుండా ఏదైనా బ్యాంకు రుణం కోసం కొత్తగా తెరిచిన ఖాతాకు ఆధార్‌ లింక్ చేస్తున్నారు. ఆ సమాచారం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ఇండియా (ఎన్‌పీసీఐ) కు వెళుతుంది.. ఆటోమేటిగ్గా రాయితీ పడే ఖాతా మారిపోతుంది. ఆ విషయం తెలియక ఎప్పుడూ పడే ఖాతాలోనే చూసుకుంటాం. దాంతో సమస్య వస్తోంది. అది ఏ ఖాతాలో పడుతుందో మీ మొబైల్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. *99*99# కి డయల్‌ చేయాలి. వెంటనే మీ ఆధార్‌ నంబరు అడుగుతుంది. దాన్ని ఎంటర్‌ చేసి కన్ఫమ్‌ చేయడానికి 1ని నొక్కాలి. అంతే మీ ఆధార్‌ నంబరు చూపిస్తూ అది ఏ బ్యాంకుకు అనుసంధానమైందో. చివరి సారి ఎప్పుడు రాయితీ పడిందో చెబుతుంది..

తెలుగులోనూ.

మనం వాడేది భారత, హెచ్‌పీ, ఇండియన్‌ గ్యాస్‌లలో ఏదైనా సరే సమస్య వస్తే మూడింటికి కామన్‌గా ఉన్న 18002333555 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదివ్వొచ్చు. ఇంగ్లిష్‌,
హిందీతోపాటు తెలుగులోనూ మాట్లాడే ప్రతనిధులు ఉంటారు.
ఇంకా ఈ సమస్యలనూ ఫిర్యాదు చేయొచ్చు

* గ్యాస్‌ బరువు తగ్గినా.
* సీల్‌ లేకుండా వచ్చి ఇచ్చినా.
* బుక్‌ చేసినా నిర్ణీత సమయంలో డెలెవరీ చేయకపోయినా.
* గ్యాస్‌ డీలరు మోసం చేసినా.
* వీటితోపాటు గ్యాస్‌కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఈ కాల్‌ సెంటర్‌ను సంప్రదించొచ్చు.

పాత ఖాతాకే రాయితీ పడాలనుకుంటే….

కొత్తగా సబ్సిడీ పడే బ్యాంకు ఖాతాలో కాకుండా గతంలో పడే అకౌంట్‌లోనే పడాలనుకుంటే. ఆ బ్యాంకుకు వెళ్లి ఒక ఆధార్‌ జిరాక్స్‌ ఇచ్చి మీ ఎకౌంట్ కు అనుసంధానం చేయాలని అడగాలి. ఒక వేళ ఇప్పటికే జతచేసి ఉందని బ్యాంకు అధికారులు చెబితే, సబ్సిడీ వేరే ఖాతాకు వెళ్లిన విషయం చెప్పి ఎన్‌పీసీఐ సర్వర్‌కు అనుసంధానం చేయాలని తెలియజేయాలి.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: