Connect with us

Technology

జస్ట్ ఒక మిస్డ్ కాల్ తో బ్యాంకు బ్యాలన్స్, మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోవచ్చు. ఎలాగో మీరే చూడండి.

Published

on

బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోవడం కొంచెం చిరాకైనా పనే. అసలు ఏ నెంబర్ కి కాల్ చేస్తే మన బ్యాంక్ బ్యాలన్స్ తెలుస్తుందో అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఆ నెంబర్ దొరికిన తర్వాత కాల్ చేస్తే.. ఈ ఆప్షన్ నొక్కండి.. ఆ ఆప్షన్ నొక్కండి అంటూ మరింత సమయాన్ని అంతా వృధా చేస్తాయి. ఈ తల నొప్పి నుండి ఖాతాదారులను కాపాడడానికే రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వారు ఓ కొత్త నెంబర్ ను ప్రవేశపెట్టారు. ఈ నెంబర్ కు డయిల్ చేస్తే చాలు క్షణాల్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికి మీ ఇంటర్నెట్ తో కూడా అవసరం లేదు.

మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడంతో పాటు మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే ఈ క్రింది నెంబర్లకి కూడా డయల్ చేస్తే చాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే… మీ బ్యాంక్ అకౌంట్‌కి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. వేరే ఫోన్ నెంబర్ నుండి డయల్ చేస్తే ఏ ఫలితం ఉండదు.

Axis Bank

18004195959 బ్యాంక్ బ్యాలెన్స్

18004196969 మినీ స్టేట్‌మెంట్

Andhra Bank

09223011300 బ్యాంక్ బ్యాలెన్స్

09224150150 బ్యాంక్ బ్యాలెన్స్

Bandhan

18002588181 కస్టమర్ కేర్

Bank of Baroda

09223011311 బ్యాంక్ బ్యాలెన్స్

Bank of India

09015135135 బ్యాంక్ బ్యాలెన్స్

Canara

09015483483 బ్యాంక్ బ్యాలెన్స్

09015734734 మిని స్టేట్‌మెంట్

Central Bank

09222250000 బ్యాంక్ బ్యాలెన్స్

Corporation

09289792898 బ్యాంక్ బ్యాలెన్స్

HDFC

18002703333 బ్యాంక్ బ్యాలెన్స్

ICICI

02230256767 బ్యాంక్ బ్యాలెన్స్

IDBI

09212993399 బ్యాంక్ బ్యాలెన్స్

Indian

09289592895 బ్యాంక్ బ్యాలెన్స్

IOB

04442220004 బ్యాంక్ బ్యాలెన్స్

ING Vysya

బ్యాలెన్స్ కోసం – BAL అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి

స్టేట్‌మెంట్ కోసం – MINI అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి

Karur Vysya

09266292665 గత 3 లావాదేవీలు

PNB

18001802222 బ్యాంక్ బ్యాలెన్స్

Syndicate

09664552255 బ్యాంక్ బ్యాలెన్స్

SBH

09223766666 బ్యాంక్ బ్యాలెన్స్

SBI

1800112211 బ్యాంక్ బ్యాలెన్స్

Union

09223009292 బ్యాంక్ బ్యాలెన్స్

Vijaya

18002665555 బ్యాంక్ బ్యాలెన్స్

 

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: