Connect with us

Health

అన్నం వండుకునేటప్పుడు ఇదొక్కటి చేర్చితే కొవ్వు కరుగుతుంది.. శరీరంలోకి కొవ్వు చేరదు..!

Published

on

కాయా కష్టం చేసేవారు అన్నం ఎంతతిన్నా వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్యల్లా పనిలేకుండా కూర్చుని పనిచేసేవారికే.. భోజనం మూలంగా శరీరంలోకి చేరిన శక్తి క్యాలరీలకు క్యాలరీలు డిపాజిట్ అయిపోతుంది. అందుకే బరువు పెరుగుతుంటారు. అంతేకాదు హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ వంటి ప్రమాదకరమైన రోగాలెన్నోవస్తాయి. ఇప్పుడు అందరు తెల్లని మల్లె పూవుల పాలిష్ చేసిన అన్నం తినేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పోషకాలు, ఫైబర్ ఏమాత్రం ఉండని ఈ అన్నంతో బాడీకి కలిగే నష్టాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఓ ప్రత్యేకమైన పద్ధతిలో అన్నం వండుకుని తినడం గురించి తెలుసుకుంటున్నారు. ఇలా చేయడం వలన శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరవు. కొవ్వు కూడా రాదు. ఇప్పటికే డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇంతకీ ఆ పవర్ ఫుల్ టిప్ ఏంటో తెలుసుకుందాం..

* బియ్యం, నీళ్లతో పాటుగా వండే గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె వేయాలి. జుట్టుకు రాసుకునేది కాకుండా వంటల్లో వాడే కొబ్బరి నూనె ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. గానుగ వద్ద కూడా తెచ్చుకోవచ్చు.
* వంటలో 3శాతం కొబ్బరి నూనె కలపాలి. అంటే కిలో బియ్యం అన్నం వండాలనుకుంటే 30 గ్రాములు కలుపుకోవాలి. ఇక అన్నం వండడం సాధారణంగానే చేయాలి. ఉడికిన తర్వాత చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టాలి. 12 గంటల తర్వాత అన్నాన్ని బయటకు తీసి లైట్ గా వేడిచేసుకుని వెంటనే తినేయాలి.

ప్రయోజనాలు:

* కొబ్బరి నూనెతో అన్నం వండితే రెసిస్టెంట్ స్టార్చ్ సంక్లిష్ట పిండి పదార్థంగా మారుతుంది. ఇటీవలి పరిశోధనలో ఈ విషయం తెలిసింది. ఇలా సంక్లిష్ట పిండి పదార్థంగా మారిన అన్నాన్ని తింటే మనకు సాధారణ అన్నం కన్నా దాదాపుగా సగం క్యాలరీలు తక్కువగా వస్తాయి.
* అంతేకాదు ఇలా వండిన అన్నంతింటే క్యాలరీలు రక్తనాళాల్లోకి శక్తిగా కొద్ది కొద్దిగా కలుస్తుంటాయి. దీని వల్ల ఎప్పటి శక్తి అప్పుడు ఖర్చయి పోతుంది.
* ఈ అన్నం సాధారణ భోజనంలా కాకుండా ఆలస్యంగా జీర్ణమవుతుంది. ఇందుకోసం ఒంట్లో ఉన్న కొవ్వును ఖర్చు చేసుకుంటుంది. దీని వల్ల మనకు తక్కువగా క్యాలరీలు అందడమే కాకుండా బాడీలోని కొవ్వు డిపాజిట్లు కరుగుతాయి.
* చాలా కొద్ది మోతాదులో ఈ అన్నం తిన్నా కొన్ని గంటలపాటు ఆకలివేయదు. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల బరువు తొందరగా తగ్గుతారు.
* షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం అన్నం మానేసి చపాతీలు తినేందుకు ఇబ్బంది పడుతున్న వారు దీనిని తినొచ్చు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో డయాబెటిస్ మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు.
* మల బద్దకం పోతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. శరీరంలోని చెడు బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: