Connect with us

Movie News

సంక్రాంతికి హిట్ కొట్టిన బాలయ్య జై సింహ మూవీ

Published

on

నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఫాలోయింగ్ ఎలా ఉంటుందో చెప్పనవసరంలేదు. ఇలాంటి మాస్ హీరోకి మంచి కమర్షియల్ దర్శకుడు తోడైతే. ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ సంక్రాంతికి అలాంటి కాంబినేషనే సందడి చేస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్, బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జైసింహా’. బాలయ్య అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే సినిమా ప్రదర్శితమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసినవారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.

సినిమా ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ అయితే దాన్ని మించి ఉందని ట్వీట్లు చేస్తున్నారు. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయని మొత్తంగా ఇది మంచి మూవీ అని మరొకరు ట్వీట్ చేశారు. సెకండాఫ్‌లో రెండు ఎపిసోడ్‌లు అద్భుతంగా ఉన్నాయట. అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అని అంటున్నారు. రూ.30 కోట్లు పైగా వసూలు చేస్తుందని ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. ఇది పక్కా బాలయ్య షో అట. డ్యాన్సులు, ఫైట్లతో బాలయ్య ఇరగదీసాడంట. ఈ ఏడాది తొలి హిట్ ‘జైసింహా’ అని, ఇది సంక్రాంతి హిట్టు బొమ్మ అని ట్వీట్లు చేస్తున్నారు .

హీరో నిఖిల్ కూడా ‘జైసింహా’ ప్రీమియర్ షో చూశారు. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్య బాబు ఈస్ ద బెస్ట్. ఫిలడెల్ఫియాలో ‘జైసింహా’ ప్రీమియర్ షో చూస్తున్నా’ అని నిఖిల్ ట్వీట్‌లో చెప్పారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని, తొలి భాగంలో ‘అమ్మకుట్టి’ పాట, బ్రాహ్మణుల సన్నివేశం, ఇంటర్వెల్ హైలైట్ అని మరొకరు ట్వీట్ చేశారు. మొత్తానికి సోషల్ మీడియా టాక్‌ను బట్టి చూస్తుంటే ఈ సంక్రాంతికి బాలయ్య హిట్టు కొట్టినట్లే అని అనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా హిట్టు కొడితే కలెక్షన్లు అదే రేంజులో రాబడుతుంది.

 

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: