Connect with us

Movie News

అజ్ఞాతవాసి సినిమా పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Published

on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈనెల 10 నుంచి 17 వరకు రోజూ రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ ప్రోగ్రాం కి అనుమతినిచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ చంద్రబాబు సర్కారు నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపింది.

పవన్ కళ్యాణ్, కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంగీతం అనిరుధ్ అందించారు. జనవరి 6వ తేదీన విడుదలైన అజ్ఞాతవాసి ట్రైలర్ యూట్యూబ్ లో కేకపుట్టిస్తోంది. ఈ ట్రైలర్ పై పలువురు సినీ ప్రముఖుల స్పందనలు ఇలా ఉన్నాయి..ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ఉంది, దాని చర్యలు ఊహాతీతం… దట్స్ ది బ్యూటీ అని నితిన్ ట్వీట్ చేశారు.

చాలా కాలంగా ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను.. నేను చేసిన వెయిటింగుకు సంతృప్తి పడేలా ఉంది అని వెన్నెల కిషర్ ట్వీట్ చేశారు. తన మామయ్య మూవీ ట్రైలర్ చూసిన అనంతరం సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ… స్వాగతం కృష్ణా అంటూ ట్వీట్ చేశారు. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు… అంటూ పవర్ స్టార్ జపంలో మునిగిపోయింది యాంకర్ శ్రీముఖి.

Latest News

Trending

%d bloggers like this: