Connect with us

Movie News

మెగా ఫ్యామిలీ నుండి రానున్న మరో హీరో

Published

on

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ అంటే పేరుకు తగ్గట్టే అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటా తమ హవాను కొనసాగిస్తూనే ఉన్నారు. నందమూరి, ఘట్టమనేని, దగ్గుబాటి, మంచు ఇలా చాలా ఫ్యామిలీలు ఉన్నా మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజే వేరు. అందుకే ఈ ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయ్యేందుకు తహతహలాడుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి వాళ్ల తమ్ముళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు.. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, మెగా డాటర్ నిహారిక, మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. రీసెంట్‌గా ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా కొబ్బరికాయ కొట్టేశారు. రీసెంట్ గా మరో హీరో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఆయన ఎవరో కాదు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

ఇప్పటికే మెగా మేనల్లుడుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ వరుస మూవీలను చూస్తూ మెగా అభిమానుల్లో సుప్రీమ్ హీరోగా స్థానం సంపాదించేశారు. ఇప్పుడు తన అన్న బాటలోనే మామయ్య చూపిన మార్గంలో ప్రయాణించేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారు సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

అయితే వైష్ణవ్ తేజ్‌కు కెమెరా కొత్తేం కాదు. ఆయన బాల నటుడిగా మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ మూవీలో నటించి మెప్పించారు. ఆ మూవీలో వీల్ చెయిర్‌‌లో అచేతనంగా ఉండే బాలుడి క్యారక్టర్ ని పోషించింది ఈ వైష్ణవ్ తేజనే. అయితే ఈ మెగా మేనల్లుడు త్వరలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. ప్రముఖ డైరెక్టర్, నటుడు అవసరాల శ్రీనివాస్ డైరేక్షన్ లో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడట వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ మెగా ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. నటనలో శిక్షణ పొందుతున్నాడు.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: