Connect with us

Movie News

అరెస్ట్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన యాంకర్ ప్రదీప్..!

Published

on

మీడియా ముందుకు వచ్చిన యాంకర్‌ ప్రదీప్‌ :

టీవీ యాంకర్‌ ప్రదీప్‌ ఎక్కడ? గురువారం కూడా అతడు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ దొరికిపోయాడు. అతడు ఎక్కువ మోతాదులో మద్యం తాగినట్టు (178ఎంజీ/100ఎంల్‌) పరీక్షలో తేలింది.అప్పటికప్పుడు ప్రదీప్‌ వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు.. బేగంపేట ట్రాఫిక్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పి వదిలేశారు.

మరో కారు ద్వారా అక్కడి నుంచి వెళ్లి పోయిన యాంకర్ ప్రదీప్‌ సోమ, మంగళవారాల్లో కౌన్సెలింగ్‌కు హాజరవుతాడని పోలీసులు అనుకున్నారు కానీ ప్రదీప్ కౌన్స్‌లింగ్‌కు హజరుకాకపోవడంతో ప్రదీప్‌పై ఎన్నో పుకార్లు రావడం జరిగింది. వాటన్నింటికి ఆయన ఓ వీడియో ద్వారా సమాధానం చెప్పారు.అధికారుల నుంచి వచ్చిన సూచనల ప్రకారమే నడుచుకుంటున్నానని ఓ వీడియో ద్వారా ప్రదీప్ చెప్పాడు. చట్టానికి లోబడే ఉంటాను కానీ అతిక్రమించనని ప్రదీప్ అన్నారు. పోలీసులు ఇచ్చే కౌన్స్‌లింగ్‌తో పాటు దాని తర్వాత జరిగే వాటికి కూడా హాజరవుతానని ప్రదీప్ చెప్పారు.

ముందుగా ఒప్పుకున్న కానీ షూటింగ్స్ ఉండటం వల్లనే పోలీసుల వద్దకు రాలేకపోయానని అన్నారు. అంతేకాక ఫోన్లు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉండటంతో కొన్ని ముఖ్యమైన కాల్స్‌కు కూడా అటెంప్ట్ చేయలేకపోయానని ప్రదీప్ చెప్పారు. డ్రంకన్ డ్రైవ్ విషయంలో చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటంన్నిటినీ స్వీకరిస్తానని ఆయన అన్నారు. అంతే కాక డ్రంకన్ డ్రైవ్ మీద గతంలో ఓ వీడియో చేశానని దానిని ఉల్లంఘించినందుకు క్షమించండి అంటూ ప్రేక్షులను ఆయన కోరారు. అంతేకాక నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని చెప్పారు.

Latest News

Trending

%d bloggers like this: