Connect with us

Movie News

యాంక‌ర్ ప్ర‌దీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో లో దొరికినప్పుడు, కారు లో కూర్చున్న ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసా ..!

Published

on

 

కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం తాగి కారు నడిపి అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు మరో కేసు పెట్టనున్నారు. ప్రదీప్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దానిపై మరో కేసు పెట్టనున్నారు. ప్రదీప్‌ని నిపుణులు మూడు గంటల పాటు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ తర్వాత ప్రదీప్‌ను కోర్టులో ప్రవేశపెడతారు.న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్బంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే. అతను ఎక్కువ మద్యం సేవించి కారు నడుపుతుండటంతో ప్రదీప్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

అయితే ఆ సమయంలో ప్రదీప్ పక్కన కూర్చున్నది ఒక లేడీ.. ఆమె ఒక యాంకర్ అని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఆమె గతంలో ప్రదీప్ తోపాటు యాంకర్ గా పని చేసిన అప్ కమింగ్ హీరోయిన్ అనే వార్త హల్చల్ చేస్తుంది. అతని పక్కన ఉన్న లేడీ ఎవరని ఎంక్వయిరీ చేయగా ఆమె ప్రదీప్ ఫ్రెండ్ అని తెలిసింది. డిసెంబర్ 31 న వాళ్ళు న్యూ ఇయర్ పార్టీలో ప్రదీప్ తోపాటు తన ఫ్రెండ్స్ పాల్గొన్నారు. పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మద్యం సేవించి దొరికిపోయిన ప్రదీప్ కు కౌన్సలింగ్ ఇవ్వడానికి పోలీసులు అతన్నీ అదుపులోకి తీసుకున్నారు.

ఆ టైమ్ లో మిగతా వారిని వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో ప్రదీప్ స్నేహితుడు ఆమెను ఒక ప్రైవేట్ కారులో తన ఇంటికి తీసికెళ్ళిపోయాడు. అయితే రెండు రోజులుగా యాంకర్ ప్రదీప్ పక్కన కూర్చొని ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటం, ఆమె ప్రదీప్ స్నేహితురాలు కావడం వలన ఈ వార్తలకు పులుస్టాప్ పడినట్లయిందంటున్నారు.ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ యాంకర్ ప్రదీప్ కు మాత్రం చుక్కలు చూపిస్తుంది. న్యూ ఇయర్ పార్టీలో ఫుల్ గా మందు కొట్టి డ్రంక్ డ్రైవ్ లో దొరికిపోవడంపై యావత్ తెలుగు మీడియాలో సంచలన వార్తగా మారింది.

4 టీవీ ఛానళ్లలో 40కిపైగా షోలు చేసే ప్రదీప్ రూ.2కోట్ల కారు సైతం సీజ్ అయింది. ఆర్థికంగా భారీగానే సంపాదించుకునే ప్రదీప్ ఓ డ్రైవర్ ను పెట్టుకోవచ్చు కదా అని అందరు అనుకుంటూన్నారు. కనీసం ఆ ఒక్కరోజు కు అయినా వేరొకరిని డ్రైవింగ్ కి తీసుకెళ్లొచ్చు కదా అని అందరు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ కారు పోలీసులు అదుపులో ఉండగా నాంపల్లిలో ప్రదీప్ కు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చేందుకు సన్నాహాలు చేశారు. 178 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వారం రోజులు జైల్లో ఉంచుతారని అంటున్నారు.

Latest News

Trending

%d bloggers like this: