Connect with us

Movie News

రామ్ చరణ్ అనసూయ మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా..!

Published

on

తెలుగునాట బుల్లితెరపై యాంకర్స్ గ్లామర్ ట్రీట్ అవడం అనేది ‘జబర్దస్త్’ యాంకర్ అనసూయతోనే మొదలైందని టాలీవుడ్‎లో టాక్ ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కొత్త భామలు సైతం బుల్లితెరపై పొట్టిదుస్తులతో వయ్యారాల వడ్డిస్తున్నారు. అయితే వీరందరి టార్గెట్ సిల్వర్ స్క్రీన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ప్రారంభంలో పవన్ వంటి స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కి నో చెప్పిన అనసూయ ఆ తర్వాత అదే తరహా పాత్రల్లో నటిస్తుంది.

‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’, ‘విన్నర్’ వంటి సినిమాల్లో మెరసిన అనసూయ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’లో నటిస్తోంది. చరణ్, సమంత క్యారెక్టర్స్‎కు సంబంధించిన ఫొటోస్ రావడంతో ఇప్పుడు అందరిచూపు అనసూయ క్యారెక్టర్ పై కన్ను పడింది. ఈ సినిమాలో అనసూయ క్యారెక్టర్ ఏమిటనే విషయంపై జనాలు ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో అమ్మడి క్యారెక్టర్ పై ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది.

రామ్‎ చరణ్ కి మేనత్త పాత్రలో నటిస్తోందట అనసూయ. అత్త పాత్ర అనగానే సీనియర్ యాక్ట్రెస్‎లా తెల్లజుట్టుతో కనిపించే ముసలి క్యారెక్టర్ అనుకోవాల్సిన పనిలేకపోవచ్చు. ఒకవేళ చరణ్ పాత్ర చిన్నప్పటి సీన్స్‎లో అత్తగా కనిపిస్తోందేమో. ఈ అత్తకు జంటగా కనిపించే మామ జగపతిబాబు అనే అందరు అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించి ఎంత దాచేద్దాం అని సుకుమార్ టీమ్ భావిస్తున్నప్పటికీ ఎలాగోలా లీకులు జరుగుతూనే ఉన్నాయి. రేపో మాపో ఈ సినిమాలో అనసూయ క్యారెక్టర్ ఫొటోలు కూడా బయటకు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంతకూ రామ్‎ చరణ్ కి అత్తగా అనసూయ ఎలా కనిపించనుందో తెలియాలంటే మార్చి-30 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Latest News

Trending

%d bloggers like this: