Connect with us

Health

ఏయే తొక్కలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి..!

Published

on

పండ్లు మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కాని వాటి తొక్కల్లో కూడా ప్రయోజనాలు, పోషకాలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా పండ్లను తొక్క తీసేసి మరి తింటూ ఉంటాం. కొన్ని పండ్ల తొక్కలు టేస్టీగానే ఉన్నప్పటికీ మరికొన్ని వగరుగా, రుచి లేకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్ల తొక్కలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో పడేయకుండా తినాలని అంటున్నారు నిపుణులు. తొక్కలకు కొన్ని రకాల వ్యాధులను నయం చేసే సత్తా ఉందట. వాటిలో అనేక రకాల హెల్త్, బ్యూటీ బెన్ఫిట్స్ ఇమిడి ఉంటాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగంలో అనేక పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ తొక్కని చర్మంపై రుద్దడం వలన చర్మంపై పేరుకున్న డస్ట్ పోతుంది. అలాగే చర్మం డ్యామేజ్ కి లోనవకుండా ఉంటుంది.
నారింజ:

బరువు తగ్గడానికి నారింజ తొక్క సరైన పరిష్కారం. అలాగే ఇది న్యాచురల్ స్క్రబ్ లా, బ్లీచింగ్ లా చర్మంపై పనిచేస్తుంది. పంటి ఆరోగ్యానికి, శ్వాససంబంధిత సమస్యలకు, కాన్స్టిపేషన్ నివారించడానికి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆరంజ్ పీల్స్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.

దానిమ్మ:

దానిమ్మ తొక్కలోనూ చాలా ఆరోగ్య రహస్యాలున్నాయి. దానిమ్మ తొక్క పింపుల్స్, రాషెష్, జుట్టు రాలడం, చుండ్రు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే హార్ట్ డిసీజ్, గొంతు నొప్పి నివారించడంలో దానిమ్మ తొక్క ఉపయోగపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, పళ్ల పరిశుభ్రతకి ఉపయోగపడుతుంది.

అరటి:

అరటితొక్క లోపలి భాగంతో పంటిపై రుద్దడం వల్ల పళ్లు న్యాచురల్ గా తెల్లగా వస్తాయి. అలాగే అరటితొక్కను కాలిన చర్మంపై పెట్టడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. పగిలిన పాదాలపై అరటితొక్కతో రుద్దడం వలన వారంరోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి .

దోసకాయ:

దోసకాయ తొక్కలోనే హై ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గిస్తుంది. దోసకాయ తొక్కలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ కే ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, బ్లడ్ క్లాట్స్ నివారించడానికి, చూపు మెరుగుపరడానికి ఉపయోగపడుతుంది.

యాపిల్:

యాపిల్ తొక్క తినడం వల్ల ఫ్లేవనాయిడ్స్, కెమికల్స్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తాయి. ఇమ్యునిటీ పెంచుతుంది. యాపిల్ పీల్ లో ఒబేసిటీని తగ్గించే మంచి గుణం ఉంటుంది.

నిమ్మ:

ఇది చర్మంపై న్యాచురల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఈ తొక్కలుబరువు తగ్గడానికి, పంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టాక్సిన్స్ ని బయటకు పంపి ఒత్తిడిని తగ్గిస్తాయి.
నిమ్మ:

ఇది చర్మంపై న్యాచురల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఈ తొక్కలుబరువు తగ్గడానికి, పంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టాక్సిన్స్ ని బయటకు పంపి ఒత్తిడిని తగ్గిస్తాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: