Connect with us

Technology

150 ఏళ్ల తర్వాత రానున్న అరుదైన సంపూర్ణ చంద్ర గ్రహణం

Published

on

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.

విశ్వం ఎప్పుడూ రహస్యమే..

ఇక విశ్వంలో ఏర్పడే గ్రహణాలు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఈ నెల జనవరి 31 న ఏర్పడే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం కు మరింత ప్రత్యేక ఉన్నది. 150 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న ఈ చంద్ర గ్రహణం గురించి వివరాల్లోకి వెళ్తే.. 2018 జనవరి నెలలో రెండు పౌర్ణమి.. ఒకే నెలలో వచ్చే రెండో పున్నమిని బ్లూ మూన్ అంటారు.. ఇలా వస్తున్న బ్లూ మూన్ రోజైన జనవరి 31న గ్రహణం ఏర్పడటం విశేషం.. జనవరి 31 అర్ధ రాత్రి గ్రహణం ఏర్పడి.. మొత్తం 77 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ సంపూర్ణ గ్రహణాన్ని మధ్య, తూర్పు ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రజలు చూడవచ్చు. అంతేకాదు.. అలస్కా, హవాయి, ఆగ్నేయ కెనడా ప్రాంత ప్రజలు గ్రహణం ఏర్పడింది మొదలు.. గ్రహణం విడిచే వరకూ సంపూర్ణంగా చూసే అవకాశం ఉంది. బ్లూమూన్ రోజున ఏర్పడుతున్న సంపూర్ణ చంద్ర గ్రహణం 150 ఏళ్లలో ఇదే తొలిసారి.. ఈ గ్రహణ సమయంలో చంద్రుడి కింద భాగం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చివరిసారి.. ఇటువంటి గ్రహణం మార్చి 31, 1866లో కనిపించింది. ఐతే ఇటువంటి చంద్ర గ్రహణాలు మళ్ళీ 2028 డిసెంబర్ 31న, 2037 జనవరి 31 న ఏర్పడనున్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: