Connect with us

Health

పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వలన ఎన్నిఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో

Published

on

దాహార్తిని తీర్చి మెరుగైన ఆరోగ్యప్రయోజనాలను అందించేది కొబ్బరి బోండాం మాత్రమే. కలుషితం లేని స్వఛ్ఛమైన కొబ్బరి బొండాం నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరి బొండాం నీటిని వారం క్రమం తప్పకుండా పరగడుపున తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

* పరగడుపున కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి బొండాం ఉపయోగపడుతుంది.
* కొబ్బరిబొండాన్ని వారం పాటు పరగడుపున తీసుకుంటే ఇంతకు ముందు లేని ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

* వారం రోజులు పరగడుపున క్రమం తప్పకుండా కొబ్బరి బోండాం తాగడం వలన కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
* చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులపాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది.
* కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్‌ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపి తగ్గుతాయి.
* కొబ్బరి బోండాం రోజు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
* శరీరానికి కావలసిన ఫైబర్‌ను కొబ్బరిబొండాంలోని నీళ్లు అందిస్తాయి.
* కొబ్బరినీళ్లు తాగితే.. డీహైడ్రేషన్‌ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

* తల్లి పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదలకు చక్కగా పని చేస్తుంది.
* గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు తగ్గి, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
* కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపరచడానికి తోడ్పడతాయి.
* కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం తగ్గి, వయసు తక్కువగా కనపడుతుందంటున్నారు బ్యూటీషియన్లు.

Latest News

Trending

%d bloggers like this: