Connect with us

Health

ఆకాకరకాయను తినడం వలన షుగ‌ర్‌, క్యాన్స‌ర్‌, కిడ్నీ వ్యాధులను అరికట్టవచ్చు..!

Published

on

ఆగాక‌ర‌, అడ‌వి కాక‌ర‌, బొంతు కాక‌ర‌, బోడ కాక‌ర‌… ఇలా మన తెలుగు ప్రజలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. పేరుకే కాకరకాయగాని ఇందులో చేదు ఏమాత్రం ఉండదు.. కాని శరీర ధర్మాలకు అవసరమైన పోషకాలు చాలా ఉన్నాయి. వీటిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు:

1. ఆగాక‌ర కాయ‌లు మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో సహాయ పడతాయి. ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. మ‌ధుమేహం వ‌ల్ల వ‌చ్చే ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఆగాక‌ర కాయ‌లు సహాయం చేస్తాయి.
2. ఆగాక‌ర కాయ‌ల్లో పైటో న్యూట్రియంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌ను పెర‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటాయి. క్యాన్స‌ర్ కార‌కాల‌ను నాశ‌నం చేస్తాయి.
3. ఆగాక‌ర కాయ‌ల్లో ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చిన్న పిల్ల‌ల‌కు, గ‌ర్భిణీ స్త్రీలకు ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కం. దీంతో గ‌ర్భ‌స్థ శిశువు చ‌క్క‌గా పెరుగుతుంది.
4. ఆగాక‌ర కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని నివారిస్తుంది.

5. ఆగాక‌రలో ఫ్లేవ‌నాయిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి తరచుగా తింటే వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా దగ్గరకు రావు.
6. ఆగాక‌ర‌లో విట‌మిన్ ఎ కూడా బాగా దొరుకుతుంది. ఇది చూపుకు సహాయపడుతుంది.
7. మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం ఆగాక‌ర కాయ‌ల‌ను తింటుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
8. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Health

సబ్జా గింజలు.. చలవే కాదు ఎంతో ఆరోగ్యం

Published

on

వేసవి కాలం వచ్చేసింది. బయటికెళ్లి వస్తే చాలు మాడు మాడిపోతుంది. ఒంట్లో వేడి పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం చాలా పానీయాలు తాగేస్తుంటాం. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది. కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే మనకు మంచి పానీయం ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా గింజలు చాలా మంచివి.

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

పానీయం తయారీ:

సబ్జా గింజలను నీళ్లతో కడిగి వాటిని శుభ్రంచేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగొచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకుని తీసుకోవచ్చు.

మలబద్ధానికి చెక్:

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

Continue Reading

Health

పెరుగుతో గుండె జబ్బులకు చెక్

Published

on

మీరు అధిక రక్తపోటు (హైబీపీ)తో బాధపడుతున్నారా అయితే ఆహారంలో రోజూ పెరుగు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరుగుతోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చని వారు అంటున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న 30 – 55 మధ్య వయసున్న 55వేల మంది మహిళలు, 40-75 మధ్య వయసున్న 18వేల మంది పురుషులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వారంపాటు.. రోజూ 60 మి.లీ పరిమాణంలో పెరుగు తినమని సూచించారు. వారం తర్వాత వీరిపై మళ్లీ పరిశోధనలు చేయగా… శాస్త్రవేత్తలకు సరికొత్త విషయాలు తెలిశాయి. పెరుగు తీసుకున్నవారిలో చాలా మందికి.. గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గినట్లు గ్రహించారు. మిగతావారిలోనూ ఈ అవకాశం చాలావరకు తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.

Continue Reading

Health

జామపండుతో జలుబుకు చెక్

Published

on

జలుబు మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా..? అయితే జామ పండు తినండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. జలుబుతో బాధపడేవారు జామ పండు తినొద్దని చాలామంది చెబుతుంటారు, కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే జామలో జలుబును తగ్గించే లక్షణాలున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన జలుబుతో బాధపడేవారు పెద్దసైజు జామకాయను తీసుకుని అందులో గింజలు తీసేసి తినాలి. తర్వాత గ్లాసు నీళ్లు తాగితే అది మందులా పనిచేసి గొంతులోనూ, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తోంది. దీంతో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఒక్క జలుబె కాదు. ఇతర ఆరోగ్య సమస్యలకూ జామ మంచి పరిష్కారంగా పనిచేస్తోంది:

* జామ నుంచి లభించే పీచు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. వీరు జామకాయను నిరభ్యంతరంగా తినవచ్చు.

* జామకాయలో ఉండే బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

* తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లమ్ తో బాధపడేవాళ్లు పచ్చిజామకాయను ముద్దలా నూరి, రోజులో మూడునాలుగుసార్లు నుదుటిమీద పెట్టుకుంటే పెయిన్ తగ్గుతుంది.

* గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతోంది.

* ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి నొప్పి ఉన్నచోట పెడితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

* జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ ఉంటుంది. వృద్ధాప్య‌ చాయలను దూరం చేస్తోంది.

* జామలో ఉంటే కాపర్, థైరాయిడ్ సమస్యలకు మంచి పరిష్కారం ఉంటుంది.

* జామ ఆకు రసాన్ని వెన్నెముక మీద రాస్తే మూర్ఛవ్యాధి సమస్య ఉన్నవారు ఉపశమనం పొందుతారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: