Connect with us

Health

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే స్థితిమంతులు అవుతారు.. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంట..!

Published

on

పేరే మనీ ప్లాంట్.. ఇది ఇంట్లో ఉంటే డబ్బు బాగా కలిసి వస్తుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు కొద్దిగా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ వాతావరణం ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని చెబుతారు. అది ఇంట్లోని వారందరికీ శక్తినీ, అదృష్టాన్ని ఇస్తుందని కూడా చాలా మంది నమ్ముతారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మనీ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే దాన్ని ఉంచాలని పేర్కొంటున్నాయి. ఇంతకీ ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఉంచకూడదో తెలుసుకుందాం..

* మనీ ప్లాంట్ ని ఇంట్లో ఈశాన్య దిశలో (ఉత్తరం- తూర్పు మధ్యన) ఉంచరాదు. అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది. ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యం మంచిగా ఉండదు. ఈశాన్యం బరువు ఉండాలనే పేరిట పలువురు పూల కుండీని అటువైపు పెట్టడం చేస్తుంటారు.
* ఇంటిలో ఏదైనా కుండీలో లేదా బాటిల్ లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి. దీంతో ఇంట్లో ఉన్నవారి ఆర్థిక స్థితి పెరుగుతుంది.
* మనీ ప్లాంట్ కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాలి. ఇలా చేస్తే ఇంటి పరిసరాలు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
* ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకుంటే ఇంట్లో వాస్తు దోషం ఉంటుంది.
* ఇంట్లో ఆగ్నేయ దిశలో (తూర్పు- దక్షిణం మధ్యన) మనీ ప్లాంట్ ను ఉంచాలి. ఇది వినాయకుడికి ఇష్టమైన దిశ. ఈ క్రమంలో ఆ దిశలో ప్లాంట్ ను ఉంచితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇంట్లోని వారందరికీ మంచి జరుగుతుంది.

Latest News

Trending

%d bloggers like this: