Connect with us

Movie News

పవన్‌ను అలా అనడం నాకు నచ్చలేదు

Published

on

అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన ‘నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ మూవీ ఆడియో వేడుక పశ్చిమ గోదావరి జిల్లా మిలటరీ మాధవరం గ్రామంలో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బన్నీ మొదటిసారిగా జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ గురించి స్పందించాడు. పవన్‌ను అలా అనడం తనకు నచ్చలేదంటూ భాగోవోద్వేగానికి గురయ్యాడు.

పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ హీరో. ఆయన మూవీలు చేస్తే కొన్ని కోట్లు వస్తాయి. కొంచెం కష్టపడితే హ్యాపీగా బతికేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ వదులుకుని, చివరికి ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజీషన్ సైతం త్యజించి మీ కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. అలాంటిది ఆయన్ని వ్యక్తగతంగా ఎటాక్ చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక అది తప్పదు. చిరంజీవి వచ్చినప్పుడు కూడా చాలామంది చాలా మాటలు అన్నారు. అవి నా చెవుల్లో ఉండిపోయాయి. మనసులో నాటుకుపోయాయి’’ అని అల్లు అర్జున్ తెలిపాడు.

టీవీ చానెళ్లను ఉద్దేశిస్తూ. ‘‘రాజకీయాలను టీవీ చానెళ్ళలో చూస్తుంటాం. ఎవడెవడో ఎక్కి.. ఏదేదో మాట్లాడేస్తుంటాడు. కానీ, మొన్న చాలా చాలా పర్శనల్‌గా మాట్లాడారు. నాకు నచ్చలేదు. మాట్లాడేవారు. తప్పుగా మాట్లాడించేవారిదీ తప్పే. దాన్ని ప్రపంచానికి పదే పదే చూపించడం కూడా తప్పు. వెలిగింది అగ్గిపుల్లయితే.. పెట్రోల్ ట్యాంకుకే నిప్పుపెట్టి ఊరంతా అంటించారు. అది నాకు నచ్చలేదు. ఈ విషయం పబ్లిక్‌లోనే చెప్పాలనుకున్నా, చెప్పేశా’’ అని ముగించాడు. అనంతరం చెర్రీ యాక్ట్ చేసిన ‘రంగస్థలం’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపి, ‘నా పేరు సూర్య’ మూవీలోని డైలాగ్ వినిపించాడు బన్నీ.

హీరోలు వేరైనా.. మేమంతా ‘మెగా’ ఫ్యామిలీ: బన్నీ మాట్లాడుతున్నంత సేపు పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులు వారి పేర్లపై నినాదాలు చేస్తుండటంతో బన్నీ స్పందించక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మేమంతా ఒక మెగా కుటుంబమని మరిచిపోవద్దు. మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి. కానీ, మేమంతా ఒక్కటే’’ అని చెప్పాడు.

Latest News

Trending

%d bloggers like this: