Connect with us

Movie News

ఫ్రూటీ ప్రచారకర్తగా అల్లు అర్జున్

Published

on

టాలీవుడ్ మంచి టాప్ లో ఉన్న యువ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. బన్నీతో సినిమాలు చేయడం చాలా సేఫ్ అని నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే బన్నీకి ఇటు సినిమాలో పాటు అటు వాణిజ్య ప్రకటనల అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే క్లోజ్‌అప్, హీరో గ్లామర్, ఓఎల్‌ఎక్స్, హాట్‌స్టార్ వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేశారు.

ప్రస్తుతం ‘రెడ్‌బస్’ ఎక్కి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మరో వాణిజ్య ప్రకటన అవకాశం బన్నీకి దక్కింది. ప్రముఖ శీతలపానీయాల తయారీ సంస్థ పార్లే ఆగ్రో. తన పాపులర్ బ్రాండ్ ఫ్రూటీకి ప్రచారకర్తగా అల్లు అర్జున్‌ను నియమించుకుంది. దక్షిణాది మార్కెట్‌లో ఫ్రూటీ బ్రాండ్‌ను అల్లు అర్జున్ ప్రచారం చేయనున్నారు.

2022 కల్లా వ్యాపారాన్ని రూ.10వేల కోట్ల స్థాయికి పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగా అల్లు అర్జున్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘దక్షిణ భారత్‌పై బలమైన దృష్టి సారించాం. ఈ రీజియన్‌లో మార్కెటింగ్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్‌లో మంచి ఫలితాలు సాధించాలంటే ఈ ఒప్పందం మాకు ఎంతో అవసరం’ అని అల్లు అర్జున్‌ను అంబాసిడర్‌గా నియమించుకోవడంపై పార్లే ఆగ్రో జాయింగ్ ఎండీ, సీఎంవో నాడియా చౌహన్ చెప్పారు. ఉత్తర భారతదేశం తరవాత పార్లే ఆగ్రోకు దక్షిణ భారతం రెండో రెండో అతిపెద్ద మార్కెట్. కాగా, దక్షిణాది నుంచి ఫ్రూటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న తొలి సినీ నటుడు అల్లు అర్జున్.

Latest News

Trending

%d bloggers like this: