Connect with us

Technology

ఎయిర్‌టెల్ వారి సరి కొత్త ఆఫర్ 98 రూపాయలకే 5 జీబీ డేటా

Published

on

తన ప్రీపెయిడ్ వినియోగదారులకు టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ తీపికబురు అందించింది. కేవలం రూ.98కే 5జీబీ డేటాను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈ ప్లాన్‌ కింద 2 జీబీ డేటాను అందించేవారు. అయితే ఇప్పుడు దీన్ని 5 జీబీకి పెంచారు. ఈ ఆఫర్ ద్వారా వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌‌లు లభించవు. కేవలం డేటా మాత్రమే లభిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. దీనికి ఎలాంటి రోజువారీ డేటా పరిమితి లేదు.

రిలయెన్స్ జియో ఇప్పటికే తన వినియోగదారులకు రూ.98 ప్లాన్‌‌ను అందిస్తోంది. దీని ద్వారా 28 రోజుల కాలపరిమితితో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తున్నాయి. జియోకు దీటుగా ఎయిర్‌టెల్ కూడా. రూ.98 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Latest News

Trending

%d bloggers like this: