Connect with us

Movie News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఎటాక్: నాకు అలాంటి అనుభవం లేదు కాని..

Published

on

పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ మూవీలో నితిన్‌కి జంటగా నటించి కుర్రకారు హార్ట్ బీట్ పెంచేసింది బాలీవుడ్ బ్యూటీ ఆదాశర్మ. ఈ మూవీపెద్దగా ఆడకపోయినప్పటికీ గ్లామర్ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందం, అభినయం అన్నీ ఉన్నా.. అదృష్టం కలిసి రాకపోవడంతో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ మూవీస్ లో సెకండ్ హీరోయిన్‌గా సరిపెట్టేసుకుంది ఆదా. ఇక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అడుగుమోపిన ఈ భామ అడపాదడపా మూవీలను చేస్తునే ఉంది. ఇక సోషల్ మీడియా హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ఫ్యాన్స్‌కి ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. టాలీవుడ్‌ని గతకొంతకాలంగా కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై స్పందించారు.

తమకు ఇష్టమైన రంగంలో రాణించాలి అంటే శారీరక సుఖం అందించడానికి కూడా కొంతమంది వెనకడుగు వేయడం లేదు. అది వారి వ్యక్తిగతమైన ఇష్టం. సెక్సువల్ ఫేవర్ అనేది వాళ్ల ఇష్టాన్ని బట్టే ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఇది ఎవరికీ తెలియని విషయమేమీ కాదు అంటూ క్యాస్టింగ్ కౌచ్‌పై తన అభిప్రాయాన్ని చెప్పింది ఆదాశర్మ.

అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వాళ్ల ఇష్టం లేకుండా మహిళల్ని వేధించడం, వారిని మభ్యపెట్టడం లాంటివి చాలా తప్పు. అయితే ఇలాంటి అనుభవం నాకు ఎదురుకాలేదన్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఒక్క మూవీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉందని ప్రస్తుతం ఫోకస్ మొత్తం మూవీ రంగానికి మళ్లిందన్నారు ఆదాశర్మ.

Latest News

Trending

%d bloggers like this: