Connect with us

Movie News

చిరంజీవి, పవన్ కళ్యాణ్, నానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

Published

on

టాలీవుడ్‌లో నడుస్తున్న చీకటి వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూవీస్ లో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేయడం.. ఆ తరువాత వాళ్లను మానసికంగా శారీరకంగా హింసించడం లాంటి చర్యలను తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రంగుల ప్రపంచం వెనుకున్న గుట్టు అన్ని సందర్భాల్లోనూ బయటపడదు. కొన్నిసార్లు ఇలా చేయడానికి ఇష్టం లేక చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి దూరం అయితే కొంతమంది ఈ చీకటి దారిలో నడుస్తూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. అయితే ఇండస్ట్రీలో ఉన్న ఈ చీకటి కోణంపై తన గోడును చెప్పుకున్నారు వర్ధమాన నటి శ్రీరెడ్డి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరుతో మహిళా ఆర్టిస్ట్‌లను వాడుకోవడం) చాలా ఎక్కువగా ఉందని, కొన్ని సందర్భాల్లో హీరోలు, డైరెక్టర్లే కాకుండా రాజకీయ నాయకుల దగ్గరకు కూడా వెళ్లమని ఫోర్స్ చేస్తారంటూ సంచలన విషయాలను బయటపెట్టింది శ్రీ రెడ్డి. తాను తెలుగు అమ్మాయిని అయినప్పటికీ హీరోయిన్‌గా అవకాశాల కోసం అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. మిగిలిన ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితి లేదని. వాళ్లు తమ భాషకు సంబంధించిన అమ్మాయిలకు ప్రాధాన్యత ఇస్తారన్నారు.

కొత్తగా వచ్చేవాళ్ల పరిస్థితి సినీ ఇండస్ట్రీలో చాలా దారుణంగా ఉందని ముందే కోఆర్డినేటర్స్ కమిట్మెంట్ ఇస్తారా అని అడిగేస్తారని దానికి ఓకే చెప్తే అప్పుడు నిర్మాతలు, హీరోలకి పరిచయం చేస్తారన్నారు. అంతెందుకు కోఆర్డినేటర్స్ కూడా అవసరం లేదని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నిర్మాతలు, హీరోలు బ్రోకర్లుగా తయారయ్యారని, కొంతమంది హీరోల పేర్లు చెప్పితే వాళ్ల బతుకు ఇక్కడే కుప్పకూలిపోతుందన్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా పొలిటికల్‌గా లబ్ధి పొందేందుకు వాళ్లు వాడుకోవడమే కాకుండా రాజకీయ నాయకుల దగ్గరకు పంపిస్తారంటూ చెప్పింది శ్రీ రెడ్డి.

ఇక ఇండస్ట్రీలో కుల పిచ్చి చాలా ఎక్కువగా ఉన్నదని.. ఓ వర్గం వారికి మాత్రమే బాగా ఆఫర్స్ ఇస్తున్నారంటూ.. తన పేరులో రెడ్డి అని ఉండటం వల్ల చాలా మంది కామెంట్ చేశారని, ఇక సోషల్ మీడియాలో శ్రీ పక్కన రెడ్డి అని పెట్టుకునే అర్హత లేదంటూ ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు అని చెప్పింది.

తెలుగులో హీరోయిన్‌గా రాణించాలంటే తెలుగుని తెల్గు అని వచ్చీరాని భాషలో మాట్లాడే పరాయి భాషవాల్లకే వరుస అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇక తెలుగు మూవీ ఇండస్ట్రీ అంతా కాపీ క్యాట్‌తోటే నడుస్తుందన్నారు. బాలీవుడ్‌లో హీరోయిన్ సన్నగా ఉంటే ఇక్కడా సన్నగా ఉండాలంటారు. మిగతా భాషల్లో ఏదీ ఫాలో అయితే మనోళ్లు అదే ఫాలో అవుతారు. సొంతంగా ఏదీ ఆలోచించరన్నారు. అయితే తెలుగు హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ చేయరు.. వాళ్లు నటించరు అంటూ ప్రొడ్యుసర్స్ డిసైడ్ అయిపోతున్నారన్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పైన, ఆయన ఫ్యాన్స్‌పైన పలు ఆరోపణలు చేశారు శ్రీ రెడ్డి. టాప్ హీరోలు చెబితే నిర్మాతలు ఆర్టిస్టులను తీసుకుంటారని పవన్ కళ్యాణ్ తెలుగు గురించి తెగ స్పీచ్ లు ఇస్తారు కాని తెలుగు హీరోయిన్స్‌ని తన మూవీలో తీసుకోమని ఎందుకు అడగరని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల తాను చాలా టార్చర్ అనుభవించానన్నారు. తాను ఆత్మాభిమానం వదిలివేయడం వల్లే ఇంకా బ్రతికి ఉన్నానని.. లేదంటే వాళ్లు అన్న మాటలకు నేను ఎప్పుడో ఉరిపెట్టుకుని చనిపోవాల్సిందే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీ రెడ్డి.

ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్. కమిట్మెంట్ అంటూ వెంటపడే కుక్కలు చాలా ఉన్నాయని. ప్రభుత్వ పరంగా వీరిపై చర్యలు తీసుకుని తెలుగు మూవీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లభించే విధంగా రూల్స్ తీసుకురావాలంటూ ఏడ్చేశారు శ్రీరెడ్డి.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Movie News

నీదీ నాదీ ఒకే కథ మూవీ టాక్: నిజంగా ఇది మనందరి కథే

Published

on

నీదీ నాదీ ఒకే కథ మూవీ.. ఇది మనందరి కథ అంటూ హీరో శ్రీవిష్ణుతో పాటు మూవీ యూనిట్ మొత్తం విపరీతంగా ప్రచారం చేసింది. ఈ మూవీకు సమర్పకుడిగా ఉన్న నారా రోహిత్ అయితే ఇలాంటి కథను తన దగ్గరకు తీసుకొచ్చిన శ్రీవిష్ణు, డైరెక్టర్ వేణు ఊడుగులకు థ్యాంక్స్ అంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడారు. మరో శర్వానంద్‌ అయితే ఇంత మంచి మూవీ బిజినెస్‌ను తాను మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నానని అన్నారు. ఓ మూవీను ప్రచారం చేయడానికి చాలా మంది చాలానే చెబుతారు. చిత్రసీమలో ఇది సాధారణమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ మూవీకు సంబంధించి అలా కాదు.

మూవీ చూసిన వారు నారా రోహిత్, శర్వానంద్ చెప్పిన మాటలు నిజమే అనక మానరు. అంతగా ఆకట్టేసుకున్నాడు శ్రీవిష్ణు. ఇది మన కథ.. మన ఎదురింటోడి కథ.. మన పక్కింటోడి కథ.. అనిపించేలా ఈ మూవీ ఉందని అందరూ అంటున్నారు. చదువంటే అస్సలు గిట్టను ఓ సాధారణ కుర్రాడి కథ ఈ మూవీ. అందులోనూ విద్యను బోధించే ఓ మాస్టారు కొడుకు కథ. చదువులో వెనకబడిన ఆ కుర్రాడు జీవితంలో ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు చెప్పే ఓ సాధారణ కథ. అయితే దానిలో ఎన్నో భావోద్వేగాలు. మూవీచూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు తన ఇంట్లో పరిస్థితులనే తెరపై చూస్తాడు. అదే ఈ మూవీను విజయంవైపు నడిపిస్తుంది.

ఇప్పటికే ఈ మూవీను చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శ్రీవిష్ణు కెరీర్‌లో ఇదో మంచి సినిమాగా మిగిలిపోతుందని అంటున్నారు. వేణు ఊడుగులకు దర్శకుడిగా మొదటి మూవీనే అయినా తన ప్రతిభతో కట్టిపడేశాడని అంటున్నారు. ఆయన రాసుకున్న డైలాగులు ప్రతి మనసును హత్తుకుంటాయట. కథ, కథనం అన్నీ కొత్తగా అనిపిస్తాయని ప్రేక్షకుల టాక్. సురేష్ బొబ్బిలి ఇచ్చిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేదిగా ఉందట. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన మూవీ అంటున్నారు. రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌‌గా వస్తున్నాయి. టాక్ అయితే చాలా బాగుంది.. మరి బిజినెస్ ఎలా చేస్తుందో చూడాలి. వాస్తవానికి ఈ మూవీకు చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారని అంటున్నారు.

Continue Reading

Movie News

#RRR: రామ్ చరణ్, ఎన్టీఆర్ వచ్చేస్తున్నారహో

Published

on

దర్శక ధీరుడు రాజమౌళీ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయులుగా మల్టీస్టారర్ మూవీ రూపొందుతుందనే వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకు ఈ మూవీపై రాజమౌళీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేని సంగతి తెలిసిందే. అయితే, ఎన్టీఆర్, చెర్రీలు ఈ మధ్య తరచుగా కలిసి తిరగడం, కలిసి అమెరికా ట్రిప్‌కి వెళ్లిరావడంతో మొత్తానికి రాజమౌళీ ఏదో చేస్తున్నాడనే క్లారిటీ వచ్చింది.

ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు బ్రేక్ ఇస్తూ.. రాజమౌళీ గురువారం ఈ మూవీపై అధికారికంగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ మూవీకు సంబంధించిన వివరాలు తెలిపారు. ‘‘2018, నవంబరు 18 నుంచి.. ఈ మూవీపై కన్ఫర్మేషన్ కోసం మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.. ఇక అఫీషియల్. భారీ మల్టీ స్టారర్ చిత్రం ఇక మొదలు కాబోతుంది’’ రాజమౌళీ ట్వీట్ చేశారు.

‘#RRR… ఇది టైటిల్ కాదు. దిగ్గజాలు కలిసివస్తున్నారు’’ అని వీడియో పోస్ట్ చేశారు. ఈ భారీ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ వీడియోలో రాజమౌళీ, రామ్ చరణ్, రామారావు (ఎన్టీఆర్) పేర్లు కలిసేలా #RRR అని చూపించారు. అయితే, ఈ మూవీ పూర్తి తారాగణం తదితర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

Continue Reading

Movie News

భరత్ అను నేను మూవీ మహేష్‌ది కాదు, పవన్‌ది

Published

on

మహేష్ బాబు హీరోగా, కొరటాల డైరేక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘భరత్ అను నేను’. ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీకి కథ అందించిన శ్రీహరి నాను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాసినట్లు చెప్పారు. 2014లో పవన్ ‘జనసేన’ పార్టీ ప్రారంభించిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిదందన్నారు.

పవన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఊహించి ఈ కథ రాశానన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్‌‌ను కలిసి స్టోరీలైన్ వినిపించానని తెలిపారు. అయితే, తాను పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ సబ్జెక్ట్‌ను ప్రజలు తప్పుగా భావించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారన్నారు. తాను సీఎం అవ్వాలనే కాంక్షతోనే పార్టీ పెట్టానని అనుకుంటారని పవన్ కళ్యాణ్ అన్నారని తెలపారు.

రచయిత, దర్శకుడు కొరటాల శివ.. శ్రీనుకు రూ.కోటి చెల్లించి కథను తీసుకున్నట్లు సమాచారం. పవన్ కొన్ని మంచి కథలను మిస్సవ్వడం ఇదే మొదటిసారి కాదు. పూరీ దర్శకత్వం వహించిన ఇడియట్, అమ్మా నాన్న తమిళ్ అమ్మాయి, పోకిరి మూవీస్ ను కూడా పవన్ వదులుకున్నాడు. ఆ సినిమాలన్నీ ఏ స్థాయిలో హిట్టయ్యాయో తెలిసిందే. మరి, ‘భరత్ అను నేను’ కూడా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే మరి.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: