Connect with us

Technology

ఆధార్ లింక్ చేసారా ..! 500 రూపాయలు ఇస్తే చాలు కొన్ని కోట్లమంది సీక్రెట్ డేటా మీ చేతుల్లోకి …?

Published

on

500కే కోట్ల మంది ఆధార్‌ వివరాలు

ఆధార్ డేటా చాలా సురక్షితమని, దాన్ని ఎవరూ కూడా దొంగలించడానికి ఆస్కారం ఉండదని ఓ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ నిజం మరోలా ఉంది. భారీ మొత్తంలో ఆధార్‌ డేటా దొంగతనానికి గురైందని తెలిసింది. కేవలం రూ.500కే వందల కోట్లకు పైగా భారతీయుల ఆధార్‌ వివరాలను అందజేయనున్నామని వాట్సాప్‌లో ఓ తెలియని గ్రూప్‌ విక్రయదారులు చెబుతున్నారు. ఈ విషయం ”ది ట్రిబ్యూన్” ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైంది. అంతేకాక ఎవరిదైనా ఆధార్‌ కార్డు కావాలంటే, వారి ఆధార్‌ నెంబర్‌తో కార్డును ప్రింట్‌ తీసేలా.. సాఫ్ట్‌వేర్‌ యాక్సస్‌ను రూ.300కే అందజేస్తున్నారని ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు పేర్కొంది.

పేటీఎం ద్వారా రూ.500 చెల్లిస్తే, పది నిమిషాల్లో, ఈ రాకెట్‌ గ్రూప్‌లోని ఏజెంట్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తాడు. ఈ పోర్టల్‌లో ఏ ఆధార్‌ నెంబర్‌ను నమోదుచేసినా.. యూఐడీఏఐ వద్ద నమోదైన ఆ వ్యక్తి పేరు, అడ్రస్‌, పోస్టల్‌ కోడ్‌, ఫోటో, ఫోన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ వంటి అన్ని వివరాలు వెంటనే వస్తాయి. ఇన్వెస్టిగేషన్‌ కోసం ”ది ట్రిబ్యూన్” విక్రయదారులకు రూ.300 చెల్లించి, సాఫ్ట్‌వేర్‌ను పొందింది కూడా. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి, వారి కార్డును ప్రింట్‌ తీసుకోవచ్చు. ఆరు నెలల క్రితమే ఈ రాకెట్‌ను ప్రారంభించారని ”ది ట్రిబ్యూన్‌” చెప్పింది. వాట్సాప్‌లో అనామక గ్రూప్‌లను సృష్టించి ఈ దొంగతనానికి పాల్పడ్డారని చెబుతూనే. ఈ గ్రూప్‌లు మూడు లక్షలకు పైగా విలేజ్‌-లెవల్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఆపరేటర్లను టార్గెట్‌ చేసినట్టు తెలిపింది.

అయితే భారీ మొత్తంలో ఆధార్‌ వివరాలు దొంగతనానికి పాల్పడ్డారనే విషయాన్ని యూఐడీఏఐ కొట్టిపారేసింది. రూ.500కే 10 నిమిషాల్లో ఎవరి ఆధార​ వివరాలైనా యాక్సస్‌ చేసుకోవచ్చని మీడియాలో వస్తున్న రిపోర్టులు పూర్తిగా అబద్దమని పేర్కొంది. ఏ ఆధార్‌ డేటా దొంగతనానికి గురికాలేదని, డేటా పూర్తిగా సురక్షితంగా, భద్రంగా ఉందని యూఐడీఏఐ తెలిపింది.12 అంకెల ఈ ఆధార్‌ను యూనిక్‌ ఐడెంటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జారీచేస్తోంది. వ్యక్తుల బయోమెట్రిక్, జనాభా సమాచారం రికార్డ్‌ చేసిన తర్వాత ప్రతి భారతీయ పౌరునిగా ఈ ఆధార్‌ నెంబర్‌ను కేటాయిస్తారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: